ETV Bharat / lifestyle

ఒక్కరే చాలా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..! - తెలంగాణ వార్తలు

‘మేమిద్దరం మాకిద్దరు..’ అనే రోజులు పోయి.. ‘మేమిద్దరం.. మాకొక్కరు..’ అనే రోజులొచ్చాయి. ఒక్కరే చాలనుకోవడం, ఆర్థిక పరిస్థితులు, కెరీర్‌కి అధిక ప్రాధాన్యమివ్వడం.. ఇలా కారణమేదైనా ఈ తరం తల్లిదండ్రుల్లో చాలామంది ఒక్కరిని కనడానికే ఆసక్తి చూపుతున్నారు. అది ఆడైనా, మగైనా ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు. నిజానికి ఇలా తోబుట్టువు లేని పిల్లలు ఒంటరితనాన్ని అనుభవిస్తారని, వారు నలుగురితో కలవలేరని, ఇంకొకర్ని కనడమే మంచిదంటూ ఇంట్లో ఉండే పెద్ద వాళ్లు పోరు పెడుతుంటారు. అవును.. ఇలా పెద్దవాళ్లు చెప్పే మాట వాస్తవమే అంటోంది ఓ అధ్యయనం.

parenting tips, parenting tips for single child parents
పిల్లల పెంపకంపై చిట్కాలు, తల్లిదండ్రులకు చిట్కాలు
author img

By

Published : Mar 27, 2021, 1:38 PM IST

తోబుట్టువులున్న పిల్లల్లో కంటే లేని పిల్లల్లో సోషల్‌ స్కిల్స్‌ చాలా తక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. అలాగని మరొకరిని కనడమనేది ఆయా తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, ఒక్కరున్నప్పటికీ వారు చురుగ్గా, నలుగురితో కలిసేలా వారిని పెంచచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి...

singlechildparenting650-4.jpg
స్వేచ్ఛగా ఎదగనివ్వాలి

కాస్త స్వేచ్ఛనివ్వండి!

తోబుట్టువు లేని పిల్లలకు ఇంట్లో ఉండే బొమ్మలు, ఇతర వస్తువులే నేస్తాలు. ఎప్పుడూ వాటితోనే ఆడుకోవాలన్నా వారికి బోరే! అలాగని అమ్మానాన్నలు తనతో కాసేపు ఆడుకుంటారేమో అని చూస్తే వాళ్లూ తమ తమ పనుల్లో బిజీ! ఇలా ఇవన్నీ వారిని ఒంటరిని చేస్తాయి. తద్వారా వీటి ప్రభావం వారి మానసిక ఆరోగ్యంపై పడుతుంది. ఎప్పుడైనా బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లినా ఇతర పిల్లలతో కలవలేకపోతారు. అంత చురుగ్గా ఉండలేరు కూడా! మరి, మీ చిన్నారి విషయంలో ఇలాంటి సమస్య తలెత్తకూడదంటే.. వారిని రోజులో కాసేపు స్వేచ్ఛగా వదిలేయండి. మీ అపార్ట్‌మెంట్‌ లేదా ఇరుగుపొరుగున ఉండే పిల్లలతో వారిని కలవనివ్వండి.. వారికి నచ్చిన ఆటలాడుకోనివ్వండి. ఈ క్రమంలో మీరూ కాసేపు మీ చిన్నారితో గడిపేందుకు వీలు చేసుకోండి. అప్పుడప్పుడూ మీ బంధువులు/స్నేహితుల ఇళ్లకు వారిని తీసుకెళ్లండి. ఇలా ఒక్కరే సంతానం అయినా నలుగురితో కలవడం వల్ల వారికి ఒంటరి అన్న ఫీలింగ్‌ రాదు.. సరికదా.. తోటి పిల్లల దగ్గర్నుంచి వారు బోలెడన్ని విషయాలు నేర్చుకునే అవకాశమూ ఉంటుంది.

singlechildparenting650.jpg
సరదాగా కాసేపు గడపాలి

నవ్వండి.. నవ్వించండి!

ఓవైపు మీ పనుల్లో మీరు బిజీ అయిపోవడం, మరోవైపు మీ చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్ల దాని ప్రభావం వారి మనసుపై తీవ్రంగా పడుతుంది. దాంతో వారు మూడీగా మారిపోతారు. ఇలా మీరు వారికి సమయం కేటాయించకపోవడం వల్ల వారి ఫీలింగ్స్‌ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక ఎప్పుడు చూసినా ఏదో లోకంలో గడుపుతుంటారు. అంతేకాదు.. ఇలాంటి చిన్నారులు టీవీ, మొబైల్‌.. వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌కి అలవాటు పడిపోతారు. వాటిలోనే తమ నేస్తాలను వెతుక్కుంటారు. ఈ అలవాట్లు వారికి అస్సలు మంచివి కావు. కాబట్టి వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులుగా మీపైనే ఉంది. ఈ క్రమంలో రోజూ వారికి తగిన సమయం కేటాయిస్తూ వారి ఫీలింగ్స్‌ని తెలుసుకోవడమే కాదు.. అందరూ కలిసి జోక్స్‌ వేసుకుంటూ కాసేపు నవ్వుకోవడం, సరదాగా అలా బయటికి వెళ్లిరావడం.. మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా సరదాగా చేసే పనులే వారిని ఆ ఒంటరితనం నుంచి బయటపడేస్తాయట! తద్వారా తోబుట్టువు లేరన్న లోటు కూడా వారికి తెలియకుండా వారిని పెంచచ్చు.

singlechildparenting650-3.jpg
పనుల్లో భాగస్వామ్యం చేయాలి

పనులు పురమాయించండి!

ఒక్కరే సంతానం కదా అని వారిని తెగ గారాబం చేస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఇంట్లో ఏ పనీ చెప్పకుండా మరీ సున్నితంగా పెంచుతుంటారు. కానీ చిన్నతనం నుంచే వారి పనులు వారు చేసుకునేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇంటి పనుల్లో వారిని భాగం చేయడం, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు వారిని వెంట తీసుకెళ్లడం.. వంటి పనుల వల్ల వారు మీతో కాసేపు గడిపినట్లూ ఉంటుంది.. కొన్ని పనులు నేర్చుకున్నట్లూ ఉంటుంది. తద్వారా వారు ఒంటరిగా ఫీలవ్వరు.. సరికదా భవిష్యత్తులో వారి పనుల కోసం ఇతరులపై ఆధారపడే అవకాశమే ఉండదు.

singlechildparenting650-2.jpg
ఆసక్తిని గమనించాలి

తపనేంటో తెలుసుకోండి!

ప్రతి ఒక్కరిలో ఏదో చేయాలన్న తపన ఉంటుంది. కొంతమందిలో చిన్న వయసు నుంచే అది మొదలవుతుంది. మీ చిన్నారిలోనూ అలాంటి ఒక తపన దాగుంటుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. చదువా, ఆటలా, పాటలా.. ఇలా వారి మనసులో ఉన్న ఆసక్తిని అడిగి తెలుసుకొని వారిని ఆ దిశగా ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. తద్వారా వారు ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలవడానికి వీలవుతుంది. ఈ క్రమంలో తమకు నచ్చిన విషయాలే కాదు.. తోటి వారి నుంచి ఇతర విషయాలు, సమాజంలో ఎవరితో ఎలా మెలగాలి?.. వంటివన్నీ ఒంటబట్టించుకుంటారు. ఇలా వారి పనుల్లో వారు బిజీ అయిపోవడం వల్ల చక్కటి నడవడికతో పాటు భవిష్యత్తుకు ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు.

singlechildparenting650-1.jpg
ఆడుకోనివ్వాలి

అంత ఖర్చు పెట్టక్కర్లేదు!

ఎలాగూ మాకు ఒక్కరే సంతానం కదా.. దాచినా, ఖర్చు పెట్టినా అది వాళ్ల కోసమే కదా.. అన్న ఆలోచనతో చాలామంది తల్లిదండ్రులుంటారు. ఈ క్రమంలో తమ చిన్నారి కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. ఏది అడిగితే అది కాదనకుండా కొనిస్తుంటారు. నిజానికి తల్లిదండ్రులు ఇలా చేయడం వల్ల పిల్లలు మరింత మొండిగా తయారవుతారంటున్నారు నిపుణులు. ఈ మొండితనం భవిష్యత్తులో వారికే చిక్కులు తెచ్చి పెట్టచ్చు. కాబట్టి ఒక్కరే సంతానం అయినప్పటికీ వారి హద్దుల్లో వారిని ఉంచుతూ.. వారి కనీస అవసరాలు తీర్చాలంటున్నారు. ఇలా చేస్తే పిల్లలు క్రమశిక్షణతో పెరగడంతో పాటు దేనికెంత ఖర్చు పెట్టాలి? ఖర్చుల్లో అవసరమైనవేంటి.. అనవసరమైనవి ఏంటి? వంటి విషయాలన్నీ వారికి తెలుస్తాయి. తద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా వారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

చూశారుగా.. తోబుట్టువు లేరన్న లోటు తెలియకుండానే మీ చిన్నారిని పెంచడమెలాగో! అయితే వీటితో పాటు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మీ పిల్లలు నలుగురితో కలిసేటప్పుడు కనీస జాగ్రత్తలు వారితో పాటింపజేయడం, సామాజిక దూరం పాటిస్తూ వారితో ఆడుకోమని చెప్పడం మర్చిపోకండి..!

ఇదీ చదవండి: 'సవాళ్లను అధిగమించేలా క్షిపణుల తయారీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.