ETV Bharat / lifestyle

మీ పిల్లల్లో మనోధైర్యం నింపండిలా...! - good parenting

విజేతలుగా నిలిచిన ఎంతోమంది తమ ఉన్నతికి తల్లిని కారణంగా చెబుతారు. అటువంటి పాత్రను పోషించే తల్లిలో పిల్లలు ఓ మెంటర్‌తోపాటూ స్నేహితురాలినీ చూస్తారు. పిల్లల్తో ఈ బంధాన్ని చిన్నప్పటి నుంచే పెంపొందించుకోవాలి...

Increase morale in your children
మీ పిల్లల్లో మనోధైర్యం నింపండిలా...!
author img

By

Published : Aug 10, 2020, 10:58 AM IST

Updated : Aug 10, 2020, 11:18 AM IST

స్కూల్‌కు వెళ్లాల్సిన అమ్మాయి ఇంకా మంచంపైనే ఉందంటే అందుకు ఏదో కారణం ఉండి ఉంటుంది. నెమ్మదిగా అడిగితే అది అనారోగ్యమా లేక మానసిక ఆందోళనా అన్నది తేలుతుంది. దాన్ని గుర్తించగలిగి, అందుకు తగ్గ చికిత్స చేయగలిగితే చాలు. ఆ అమ్మాయికి తల్లి స్నేహితురాలిగా మారినట్లే.

  • ఉద్యోగిని లేదా వ్యాపారిగా బయట ఎన్ని విజయాలు సాధించినా, ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఇల్లాలిగా మారే మహిళలే పిల్లల మనసులను అర్థం చేసుకోగలరు. వారి అవసరాలను గుర్తించే ఆప్తురాలిగానూ మారగలరు.
  • ఎటువంటి సమస్యలొచ్చినా పిల్లల ఎదుటకు తీసుకురాకూడదనే నియమాన్ని పాటించడం కన్నా, ఆయా వయసునుబట్టి వారికీ ఇంట్లో సమస్యలను చెప్పగలగాలి. తరువాత దాన్ని ప్రశాంతంగా ఎలా పరిష్కరించారో కూడా వివరించాలి. ఈ పద్ధతితో అమ్మ సామర్థ్యాన్ని పిల్లలు నేర్చుకోవడం మొదలుపెడతారు. ఆమె వ్యక్తిత్వం ఎంత బలమైందీ అనేది వారి మనసులో ముద్రపడుతుంది. అది వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
  • పిల్లల్లో కుంగుబాటును చూసినప్పుడు అందులోంచి వారిని బయటకు తీసుకురాగలగాలి. జీవితంలో ప్రతి మెట్టునూ ఆస్వాదిస్తేనే ముందుకు నడవగలమనే నిజాన్ని వారికి సున్నితంగా చెప్పగలిగితే చాలు. ఎటువంటి సందర్భంలోనైనా తల్లితో తమ భయాలను, అనుభవాలను పంచుకోగలగాలి.

Last Updated : Aug 10, 2020, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.