ఇంటికి సంబంధించిన చిన్నచిన్న పనులను అప్పగించి చూడండి. అప్పుడు పిల్లలు కాస్త బాధ్యతగా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్లను ఎత్తుకుని ఆడించే పని అప్పగించాలి. దాంతో వీళ్ల అల్లరి కాస్త తగ్గి పనుల్లో పడతారు.
నెమ్మదిగా చెప్పాలి..
అల్లరి చేస్తున్నారనే నెపంతో పిల్లల్లి కొడితే వాళ్లు ఆత్మన్యూనతకు గురవుతారు. తనంటే ఇష్టంలేదనే భావన చిన్నారిని మానసికంగా బాధపెడుతుంది. లేదా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి చివరగా దెబ్బలు తినడానికీ అలవాటు పడొచ్చు. అలాకాకుండా అమాయకత్వంతో చేసే అల్లరివల్ల తలెత్తే అనర్థాల గురించి కాస్త నెమ్మదిగా వివరించి చెప్పాలి.
నేర్పించాలి..
పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి చిన్నచిన్న వస్తువుల తయారీని నేర్పించవచ్చు. క్లేతో, గులకరాళ్లతో బొమ్మలను తయారుచేయించవచ్చు. దీనివల్ల సమయం వృథాకాదు. సరదాసరదాగా చేతి పనులు నేర్చుకుంటారు. ఈ అలవాట్లనే తర్వాత కొనసాగిస్తే మరిన్ని ఫలితాలను పొందచ్చు.