ETV Bharat / lifestyle

CORONA EFFECT: కొవిడ్​ నుంచి కోలుకున్న మహిళలపై జీవనశైలి వ్యాధుల దాడి

కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత మహిళలను జీవనశైలి వ్యాధులు వెంటాడూతూనే ఉన్నాయి. పలు అంశాల ప్రాతిపదికన హెల్పింగ్​ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్పును లెక్కకట్టినట్లు ప్రతినిధులు తెలిపారు.

CORONA EFFECT
మహిళలపై జీవనశైలి వ్యాధుల దాడి
author img

By

Published : Jul 31, 2021, 10:07 AM IST

కరోనా మహమ్మారి అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. వైరస్‌ సోకి తగ్గుముఖం పట్టాక పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లకే పరిమితమైన మరికొందరిలో జీవనశైలి వ్యాధులు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది.

నగరానికి చెందిన హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ 50 బస్తీల్లో 30 ఏళ్లు దాటిన మహిళలు 3,500 మందిని ఎంపిక చేసి రక్త పరీక్షలు నిర్వహించింది. వయసుకు తగిన బరువు ఉన్నారా? కుటుంబంలో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? పొగ, మద్యం తాగే అలవాటు ఉందా? ఇలా కొన్ని అంశాల ప్రాతిపదికన ముప్పును లెక్కకట్టినట్లు ప్రతినిధులు తెలిపారు. 5 పాయింట్లు దాటిన వారు ఎక్కువ ముప్పు కింద ఉన్నట్లు తేల్చామన్నారు. సుమారు 67 శాతం మంది జీవనశైలి వ్యాధుల ముప్పు ముంగిట ఉన్నట్లు గుర్తించామన్నారు.

సర్వేలో తేలిన ఫలితాలు

సర్వేలో తేలిన ఫలితాలు ఇలా..

క్యాటరాక్ట్‌ ఇబ్బందులు 11 శాతం

హైపర్‌ టెన్షన్‌ రెటినోపతి: 2 శాతం

ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి గ్రేడ్‌-1 ఫ్యాటీ లివర్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. నిర్లక్ష్యం చేస్తే... కాలేయ వ్యాధుల ముప్పునకు దారి తీస్తుందని వైద్యులు తెలిపారు. రోజు 45 నిమిషాలు వ్యాయమంతో పాటు ఆహారపు అలవాట్ల మార్పు, సరిపడా నిద్ర, ఒత్తిడికి దూరంగా ఉంటూ జీవనశైలి వ్యాధులను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని డాక్టర్‌ ఆయేషా ఫాతిమా సూచించారు.

ఇదీ చూడండి: మళ్లీ కొవిడ్ విజృంభణ.. రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు!

కేశసంపద కోల్పోతున్న కొవిడ్‌ బాధితులు

కేరళలో కరోనా విజృంభణ- మూడో దశకు సంకేతమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.