ETV Bharat / lifestyle

GAMES FOR KIDS: ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి ఆట విడుపు ఉండాల్సిందే - ఆన్​లైన్​ క్లాసులు

కరోనాతో చాలా కాలంగా పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనికి తోడు ఆన్‌లైన్‌ క్లాసులు... ఆట విడుపు దొరక్క, తోటి పిల్లలతో కలిసే వీలులేక ఒత్తిడికి గురవుతున్నారంటున్నాయి పలు అధ్యయనాలు. మరి ఆ ప్రభావం వారి మీద పడకుండా ఏం చేయాలో సూచిస్తున్నారు నిపుణులు.

GAMES FOR KIDS
ఆట విడుపు
author img

By

Published : Aug 13, 2021, 2:44 PM IST

పిల్లల్లో ఒత్తిడిని తీసేసేవి ఆటలే. ఆరు బయట ఆడలేకపోవచ్చు. కానీ ఇంట్లో అందుకు సమయం కేటాయించమనండి. తాడాట, దాగుడు మూతలు, డాబాపై కబడ్డీ వంటివి ప్రయత్నించొచ్చు. లేదా కాసేపు సబ్బునీటి బుడగలు ఊదించండి చాలు. ఇవన్నీ ఒత్తిడి తగ్గిస్తాయి.

  • చిన్నారులు అకారణంగా అరవడం, మీ మాట లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే... కొట్టడం తిట్టడం చేయొద్దు. అవీ ఒత్తిడి ప్రభావమే. ఇలాంటప్పుడు వారికి ఇష్టమైనవి చేసి పెట్టండి. తన స్నేహితులతో వీడియో కాల్‌లో మాట్లాడించండి.
  • ఎక్కడికీ వెళ్లకుండా, ఏ పనీ లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వస్తే... పెద్దలమే విసిగిపోతుంటాం. ఇందుకు చిన్నపిల్లలు మినహాయింపు కాదని అర్థం చేసుకోవాలి. అందుకే వారికి పని కల్పించాలి. సరదాగా తోట పని అప్పజెప్పండి. కుండీలను కొనిచ్చి మొక్కలు పెంచమనండి. లేదా ఖాళీ కూల్‌డ్రింకు సీసాల్లోనూ పెంచొచ్చు. హాబీలకు శిక్షణ తీసుకునేలా ప్రోత్సహించండి. ఇవన్నీ వారి బాధను తగ్గిస్తాయి. చలాకీగా ఉండేలా చేస్తాయి.
  • పిల్లలకు ఆటలాడటమంటే మహా ఇష్టం కదా.. అలా అని సెల్​ఫోన్​లో గేమ్స్​ వైపు.. చూసేలా చేయకండి. ఆన్​లైన్​కు దూరంగా ఆడుకునే గేమ్స్.. సృజనను పెంచే ఆటలు చాలానే ఉన్నాయి. సెలవుల్లో మీ పిల్లలతో చెస్ ఆడించండి. ఆలోచన విధానం.. మారుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో.. వారికి తెలుస్తుంది. క్యారమ్, అష్టాచమ్మా, పచ్చిస్ ఇలాంటి ఆటలు పిల్లలతో ఆడిస్తే.. వారిలో పోటీతత్వం పెరుగుతుంది. అంతే కాదు.. అంతరించిపోతున్న.. అష్టాచమ్మా, పచ్చిస్ లాంటి ఆటలు భవిష్యత్ తరాలకు అందించినవారవుతారు. ఈ ఆటలు ఆడుతూ.. కథలు చెబుతుంటే.. వాళ్లు హు.. కొడుతుంటే.. మీకూ ముచ్చటేస్తుంది.
  • పిల్లలు ఇంట్లో పాడుతుంటే.. మీరు సంబరపడిపోతారా? అదే స్జేజీపై పాడితే.. వచ్చే కిక్కు ఇంకా ఎక్కువ. ఈ సెలవు దినాల్లో పిల్లలకు పాటల పోటీలు పెట్టండి. గెలిస్తే.. బహుమతి ఇస్తామని చెప్పండి. వాళ్లు రాగం తీస్తుంటే.. తల్లిదండ్రులకు చిన్నతనం గుర్తొస్తుంది. పాటలు పాడుతు.. గెంతుతూ.. వాళ్లు సంబరపడిపోతారు. ఏమో.. భవిష్యత్​లో మీ పిల్లలే గొప్ప గాయకులు కావచ్చేమో. ఇది పాటిస్తే.. పిల్లల అల్లరి తగ్గించడంతోపాటు.. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మార్కెట్లో చిన్న చిన్న మ్యూజిక్ పరికరాలు దొరుకుతాయి. అవి కొనిస్తే.. వారే వాటితో ఆడుకుంటారు కూడా.
  • డ్రాయింగ్.. అనేది చాలా మంచి కళ. అప్పుడప్పుడేవేవో పిచ్చి గీతలు గీసి మీకు చూపిస్తారు కదా పిల్లలు. 'కరోనా' సెలవు దినాల్లో.. డ్రాయింగ్​పై దృష్టిపెట్టేలా చేయండి. ఏదైనా కార్టూన్ చూపించి.. దానిలా బొమ్మను గీయమనండి. సృజనాత్మకత పెరుగుతుంది.
  • మన తెలుగులో వేల పద్యాలున్నాయి. వాటిని కంఠతా పట్టించండి. అందులోని నీతిని పిల్లలకు బోధించండి. తెలుగును కాపాడుకున్న వాళ్లమే కాకుండా.. పిల్లలకు నీతి చెప్పినవాళ్లవుతారు. ఇలాంటి సెలవు దినాల్లో ఇంకో ముఖ్యమైన విషయం.. భాషా నైపుణ్యాలు నేర్పించడం. పెరిగి పెద్దవుతుంటే.. ఎన్ని భాషలోస్తే.. అని అవకాశాలు దొరుకుతాయి. ఇప్పటి నుంచే మీ పిల్లలకు భాషలపై పట్టు వచ్చేలా చేయండి. ఇతర భాషల్లోని ఒక్కొక్క పదాన్ని చెబుతూ.. సందర్భాన్ని బట్టి ఉపయోగించండి. భాషపై పట్టు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.
  • మార్కెట్లో చాలా కామిక్ బుక్స్​ దొరుకుతాయి. అవి పిల్లలకు ఆసక్తిగా ఉంటుంది. ఆలోచన శక్తి పెరుగేందుకు కామిక్ బుక్స్ ఉపయోగపడతాయి. తెలుగులో నీతి కథలు అనేకం.. వాటిని చదివి వినిపించండి... వారితో చదివిస్తే ఇంకా మంచిది. సందర్భాన్ని బట్టి ఎలా మెలగాలో వారికి తెలిసేందుకు ఇవి ఉపయోగపడతాయి.
  • లేదు మేం.. సినిమాలే చూస్తాం.. అని మారం చేసే పిల్లలు కొంతమంది ఉంటారు. వారికి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్​ లాంటి స్ఫూర్తిమంతమైన సినిమాలు చూపించండి. జీవితంలో ధైర్యంగా ముందుకెళ్లేందుకు ఇలాంటి సినిమాలు ఉపయోగపడతాయి.

ఈ సెలవులను పిల్లలు సరిగా ఉపయోగించుకునేలా చేస్తే.. వారికి భవిష్యత్​లోనూ ఉపయోగపడతాయి. వీడియో గేమ్స్ అంటూ.. సమయం వృథా చేయిస్తే.. అప్పుడు ఇది చేయిస్తే.. బాగుండు.. అది నేర్పిస్తే.. ఇంకా బాగుండు.. అని మీరు భవిష్యత్​లో అనుకునే అవకాశం ఉంది. మీ పిల్లలను వందలో ఒకడిలా కాకుండా.. వంద మందికి ఒకడిలా తయారుచేయండి.

ఇదీ చూడండి: ఆన్‌లైన్‌ ఆట.. మనదైన బాట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.