ETV Bharat / lifestyle

మూత్రపిండాలకి ఉప్పు ముప్పు! - ఉప్పువల్ల చెడు ప్రభావం

సోడియంను అధికంగా పీల్చుకోవడంతోనే మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని... సౌత్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీ పరిశోధక బృందం తెలిపింది. అంతేకాదు, అధికంగా ఉప్పు తినేవాళ్లలో అంటే- బీపీ ఉన్నవాళ్లలో ఎన్‌ఈడీడీ4-2 అనే ఎంజైమ్‌ శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

salt impact on kidneys
మూత్రపిండాలకి ఉప్పు ముప్పు!
author img

By

Published : May 16, 2021, 2:00 PM IST

ఏటా 70 కోట్ల మంది మూత్రపిండ వ్యాధులతో బాధపడుతుంటారు. అయితే ఇంతవరకూ దీనికి సరైన కారణం గుర్తించ లేకపోయారు. మొదటిసారిగా సౌత్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీ పరిశోధక బృందం- ఎన్‌ఈడీడీ4-2 అనే ఎంజైమ్‌ లోపం వల్లే కిడ్నీ వ్యాధులు తలెత్తుతున్నాయి అంటోంది. ఎందుకంటే ఈ ఎంజైమ్‌ సోడియంను తగుమోతాదులో గ్రహించేలా చేస్తుంది. కానీ అది తగ్గినప్పుడు సోడియంను అధికంగా పీల్చుకోవడంతో మూత్రపిండాలు దెబ్బతింటున్నాయట. అంతేకాదు, అధికంగా ఉప్పు తినేవాళ్లలో అంటే- బీపీ ఉన్నవాళ్లలో ఈ ఎంజైమ్‌ శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే కొన్నిసార్లు ఉప్పు తక్కువగా తినేవాళ్లలోనూ కిడ్నీలు దెబ్బతినడం జరుగుతుంది. జన్యులోపాలే అందుకు కారణమని వాళ్లు భావిస్తున్నారు. అలాగే డయాబెటిక్‌ నెఫ్రోపతీ వ్యాధిగ్రస్తుల్లోనూ ఈ ఎంజైమ్‌ శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి ఈ పరిశోధన ఆధారంగా ఎన్‌ఈడీడీ4-2 ఎంజైమ్‌ను మందు రూపంలో ఇవ్వడం ద్వారా ఆయా వ్యాధుల్ని తగ్గించే ఆలోచన చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'భారత్​లోకి సింగిల్​ డోసు స్పుత్నిక్ టీకా' ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.