గత ఏడాదిగా కొవిడ్ బాధితులను నిశితంగా పరిశీలించినప్పుడు 'టినిటస్' చెవిలో ఒకలాంటి మోత వస్తుంటుందని మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
కొవిడ్ వచ్చిన కొత్తలో వినికిడి సమస్యలున్న కేసులు తక్కువగా ఉన్నాయట. కానీ ఏడాది గడిచిన తరవాత 15శాతం మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందట. ఈ వైరస్ నేరుగా వినికిడి వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు, కొవిడ్ సోకిన సమయంలో రోగి ఎదుర్కొనే మానసిక ఒత్తిడివల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నట్లు వాళ్లు అభిప్రాయపడుతున్నారు. సో, కొవిడ్ వచ్చి తగ్గాక వినికిడి లోపం కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది అని చెబుతున్నారు సదరు పరిశోధకులు.
ఇదీ చదవండి: కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్‌పై మోదీ సమీక్ష