కావాల్సినవి
మామిడి పండు గుజ్జు - అరకప్పు
మామిడి పండు ముక్కలు - అరకప్పు
ఐస్ ముక్కలు- అరకప్పు
కొబ్బరి పాలు - పావు కప్పు
నిమ్మరసం - టేబుల్‌స్పూన్
తయారీ
కొన్ని మామిడి ముక్కలను పక్కన పెట్టి మిగిలినవాటిని మామిడి పండు గుజ్జు, ఐస్, కొబ్బరి పాలు, నిమ్మరసంతో పాటు బ్లెండర్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మామిడి ముక్కలను అందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరి..
కావాల్సినవి
చక్కెర - అర కప్పు
నీళ్లు - అర కప్పు
పుచ్చకాయ ముక్కలు - నాలుగు కప్పులు
చల్లని నీరు - మూడు కప్పులు
ఐస్ ముక్కలు - పన్నెండు
నిమ్మరసం - అర కప్పు
తయారీ
ముందుగా పుచ్చకాయ ముక్కలను మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో అర కప్పు చక్కెర వేసి అందులో అర కప్పు నీళ్లు పోసి కరగనివ్వాలి. ఇది కరిగిన తర్వాత దింపి కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇందులో చల్లని నీళ్లు, నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు గ్లాసుల్లో ఇందాక వడకట్టుకొని పెట్టుకున్న పుచ్చకాయ రసాన్ని పోసి, దాని పై నుంచి ఈ నిమ్మరసాన్ని పోయాలి. ఇందులో ఐస్ వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే సరి..
కావాల్సినవి
కొబ్బరి పాలు - కప్పు
బొప్పాయి ముక్కలు - మూడు కప్పులు
చక్కెర - అర కప్పు
ఐస్ ముక్కలు - రెండు కప్పులు
తయారీ
కొబ్బరి పాలు, బొప్పాయి ముక్కలు, చక్కెర, సగం ఐస్‌క్యూబులను బ్లెండర్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది స్మూతీలా తయారైన తర్వాత దీన్ని గ్లాసుల్లో పోసి మిగిలిన ఐస్ ముక్కలను వేసి సర్వ్ చేసుకోవాలి.
కావాల్సినవి
పెరుగు - ఒకటిన్నర కప్పులు
నీళ్లు - పావు కప్పు
చక్కెర - మూడు టేబుల్ స్పూన్లు
రోజ్‌వాటర్ - రెండు టీస్పూన్లు
యాలకుల పొడి - పావు టీస్పూన్
దాల్చిన చెక్క పొడి - కొద్దిగా
గులాబీ రేకలు - గార్నిష్ చేయడానికి
తయారీ
గులాబీ రేకలు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా స్మూతీలా తయారయ్యే వరకూ మిక్సీ పట్టుకొని ఆ తర్వాత గ్లాసుల్లో పోసుకోవాలి. పైన గులాబీ రేకలు, కొద్దిగా యాలకుల పొడి వేసి గార్నిష్ చేసుకుంటే సరి..
కావాల్సినవి
దానిమ్మ గింజలు - మూడు టేబుల్ స్పూన్లు
పుదీనా - కొద్దిగా
నిమ్మకాయలు - రెండు
దానిమ్మ రసం - లీటర్
నిమ్మరసం(లెమనేడ్) - అర లీటర్
తయారీ
ఈ జ్యూస్ తయారుచేయడానికి కొన్ని గంటల ముందుగానే దానిమ్మ గింజలను ఐస్‌క్యూబ్ ట్రేలో వేసి కొన్ని నీళ్లు పోసి గడ్డకట్టనివ్వాలి. పుదీనాలో సగం గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకొని మిగిలిన భాగాన్ని ఒక జగ్‌లో వేయాలి. ఇందులో నిమ్మకాయలను స్త్లెసులుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత గరిటతో వీటిని కాస్త వత్తడం ద్వారా రసం బయటకు వస్తుంది. ఇప్పుడు దానిమ్మ గింజల రసం, నిమ్మరసం వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని గ్లాసుల్లో పోసుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసిపెట్టుకున్న దానిమ్మ ఐస్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ చక్రాలు, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే దానిమ్మ మొజిటో రెడీ.
ఇదీ చదవండి: మీ ప్రేమ ఇలా తెలిసిపోతుంది..