ETV Bharat / lifestyle

కొత్తగా ఉద్యోగంలో చేరా.. ఆ సమస్యలు మర్చిపోయేదెలా?

కొత్తగా ఉద్యోగంలో చేరా. బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా. కానీ ఒక్కోసారి పని మధ్యలో వ్యక్తిగత సమస్యలు గుర్తుకొచ్చి ఏకాగ్రత కుదరడంలేదు. నా సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి? - ఓ సోదరి

author img

By

Published : Aug 26, 2020, 12:23 PM IST

How to forget those problems during the job
కొత్తగా ఉద్యోగంలో చేరా.. ఆ సమస్యలు మర్చిపోయేదెలా?

చాలామంది వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య విభజన సాధ్యమనుకుంటారు. కానీ అదంత సులభం కాదు. వృత్తి జీవితంలో జరిగే సంఘటనలు వ్యక్తిగత జీవితంమీద ప్రభావం చూపుతాయి. అలాగే వ్యక్తిగత అంశాల ప్రభావం వృత్తిమీదా ఉంటుంది. ఈ విషయాన్ని అంగీకరించి సరైన పద్ధతిలో వాటిని పరిష్కరించుకోగలగాలి. చేస్తున్న పనిలో బాగా ఇన్‌వాల్వ్‌ అవ్వడమే మీ సమస్యకు ప్రధాన పరిష్కారం. ఆఫీసులో ఉన్నప్పుడు పని ప్రాధాన్యాన్ని గుర్తించి అందులో ఎక్కువగా భాగమవ్వండి.

వాటితో దీర్ఘకాలంలో కెరీర్‌కు ఎంత మేలు జరుగుతుందో చూడండి. అలా చేస్తే ఏ పనీ భారంగా అనిపించదు. పనిమీద ఎప్పుడైనా ఏకాగ్రత కుదరకపోవడం సహజమే. కానీ దాని ప్రభావం మీ ఉత్పాదకత, వ్యక్తిగత జీవితం మీద లేకుండా చూసుకోవాలి. మీకు అప్పగించిన పనికే పరిమితం అవ్వకుండా మీ బృందంలోని మిగతావారికీ సాయం చేయండి. దానివల్ల సంస్థ కోసం పనిచేసే వ్యక్తిగా మీకు గుర్తింపు ఉంటుంది. శరీరానికి విరామం అవసరమైనపుడూ పని మీద సరిగ్గా దృష్టి పెట్టలేరు. నిర్విరామంగా పనిచేస్తుంటే కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోండి. లైఫ్‌లో బోర్‌కొట్టడంవల్ల కూడా ఏకాగ్రత ఉండదు. కొత్తనైపుణ్యాల్ని నేర్చుకోండి. ఏదైనా ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌లో భాగమవ్వండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఆఫీసులో పైవాళ్లు చెప్పినంతవరకూ వేచిచూడకుండా చొరవ తీసుకుని కొన్ని పనులు చేస్తుండండి. తోటివారికి సాయపడినప్పుడు సంతృప్తి ఉంటుంది. జాబ్‌లో అలా సంతృప్తినిచ్చే సంఘటనలే మీ ఏకాగ్రతను పెంచుతాయి.

నిపుణులు

ఇదీ చూడండి చైనాకు చెక్​: లద్దాఖ్​కు కొత్త రోడ్డు మార్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.