కరోనా కారణంగా కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే పని తగ్గింది. దాంతో వ్యాయమం చేయడంలో అలసత్వం పెరిగింది. అధికబరువు, హార్మోన్ల పనితీరులో మార్పులు చాలానే కనిపిస్తున్నాయి. వాటి నుంచి బయటపడాలంటే... కసరత్తులు అవసరం. అందుకే సరదాగా సైక్లింగ్ చేయండి!
- మీరు ప్రతిరోజూ పరుగెట్టినా కొన్నిసార్లు కార్డియో వ్యాయామ ఫలితం శరీరానికి అందకపోవచ్చు. దానికి కారణం రోజూ ఒకేలాంటి తరహా కసరత్తులు చేయడం కారణం కావొచ్చు. ప్రత్యామ్నాయంగా సైక్లింగ్‌ని ఎంచుకోండి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు... శ్వాసకోశ వ్యవస్థను దృఢంగా ఉంచుతుంది.
- వారంలో మూడు రోజులు... రోజుకు అరగంట చొప్పన సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులతో పాటు ఇతర వ్యాధులూ వచ్చే అవకాశం తగ్గుతుంది.
- సైక్లింగ్ వల్ల ఉపిరితిత్తులకు ఒత్తిడి కలిగి ఉత్తేజంగా శ్వాస తీసుకోగలుగతాం. అలా చేయడం వల్ల గాలిగదులు బలంగా తయారవుతాయి. తద్వారా ఉపిరితిత్తుల పనితీరు మెరుగ్గా పని చేస్తుంది. దీని వల్ల ఉపిరితిత్తులకు వచ్చే వ్యాధుల నుంచి 80 శాతం వరకు బయట పడవచ్చుని వైద్యులు చెబుతున్నారు.
- సైకిల్ తొక్కడంవల్ల శరీరం కింది భాగంలోని కండరాలు దృఢమవుతాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఈ వ్యాయామం శరీరానికి, మెదడుకి మధ్య బ్యాలెన్స్ చేస్తుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా నెలసరుల్లో ఇబ్బందులు అదుపులోకి వస్తాయి.
- సైక్లింగ్ వల్ల శరీరంలో అదనంగా పేరుకున్న కెలొరీలు త్వరగా కరుగుతాయి.దీంతో మాములు వాటికంటే యవ్వనంగా కనిపిస్తారు. ముఖ్యంగా నడుం కింది భాగం తొడలూ వంటి ప్రదేశాల్లో అదనంగా ఉండే కొవ్వు త్వరగా కరుగుతుంది. కీళ్లూ దృఢంగా మారతాయి.
- బరువు తగ్గాలనే లక్ష్యం పెట్టుకునే వారికి ఇది చక్కని వ్యాయామం. రోజూ కనీసం ఇరవై నిమిషాలు చేస్తే ఇది మీకు మంచి ఫలితాన్నిస్తుంది అంటున్నారు నిపుణులు. అలానే తక్కువ రిస్క్‌తో చేయగలిగే కసరత్తు కూడా ఇదే.
ఇదీ చూడండి: యుక్తవయసులో ఎంత సేపు వ్యాయామం చేయాలంటే..