ETV Bharat / lifestyle

ఉద్యోగాల భర్తీ: సంక్షేమ శాఖలతో నేడు సీఎస్ సమావేశం - సంక్షేమ శాఖలతో నేడు సీఎస్ సమావేశం

సంక్షేమశాఖలతో నేడు సీఎస్ సోమేశ్‌కుమార్ సమావేశం కానున్నారు. ఉద్యోగాల భర్తీలో భాగంగా ఖాళీలను గుర్తించేందుకు ఈ భేటీ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో సీఎస్​ సమావేశమై శాఖల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోనున్నారు.

ఉద్యోగాల భర్తీ: సంక్షేమ శాఖలతో నేడు సీఎస్  సమావేశం

author img

By

Published : Dec 19, 2020, 7:31 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఖాళీల గుర్తించేందుకుగానూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం సంక్షేమశాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో జరిగే ఈ సమావేశంలో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, ఇంజినీరింగ్‌ విభాగం, కార్పొరేషన్లు, సహకార సంస్థల్లో ఖాళీల వివరాలు తెలుసుకోనున్నారు.
12 వేలకు పైగానే
ఇప్పటికే సంక్షేమశాఖలు ఖాళీల గుర్తింపు ప్రక్రియను చేపట్టాయి. సబార్డినేట్‌ పోస్టుల ఖాళీలతో సహా అన్నింటి వివరాలను క్రోడీకరించి నివేదికలు సిద్ధంచేశాయి. సంక్షేమశాఖల పరిధిలోని గురుకులాల్లో అత్యధికంగా ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలు దాదాపు 8 వేల వరకు ఉన్నట్లు తెలిసింది. బీసీ గురుకులాల్లో ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ పోస్టులు దాదాపు 4 వేలకు పైగా ఉన్నట్టు సమాచారం.

వచ్చే ఏడాది నుంచి 119 గురుకులాలు జూనియర్‌ కళాశాలలుగా మారనున్న నేపథ్యంలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులనూ కలిపితే ఖాళీల సంఖ్య భారీగా పెరగనుంది. సంక్షేమ వసతి గృహాల్లో కిందిస్థాయిలో 20 ఏళ్ల నుంచి నియామకాలు చేపట్టలేదు. సహకార సొసైటీల్లోనూ ఇదే పరిస్థితి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఈ పాఠశాలల్లో దాదాపు 1,000 వరకు పోస్టులు భర్తీకి నోచుకోలేదు. మొత్తంగా సంక్షేమ శాఖల్లో సబార్డినేట్‌ పోస్టులతో కలిపి మొత్తం 12 వేలకు పైగా ఖాళీలు ఉండే అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంపై తుది నిర్ణయం...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.