ETV Bharat / lifestyle

వేసవిలో.. కడుపు చల్లగా! - వేసవిలో చల్లచల్లగా

ఈ కాలంలో బయట ఎండ... ఒంట్లో వేడి... తెగ ఇబ్బంది పెట్టేస్తాయి. తిండి సహించదు. డీహైడ్రేషన్‌ సమస్య అదనం. వీటిని అధిగమించేందుకు కొన్ని పదార్థాలను డైట్‌లో భాగంగా చేసుకుంటే శరీరానికి శక్తితోపాటు చల్లదనమూ అందుతుంది.

cool-foods-to-help-fight-the-summer-heat
వేసవిలో.. కడుపు చల్లగా!
author img

By

Published : May 6, 2021, 1:56 PM IST

పెరుగు

వేసవిలో.. కడుపు చల్లగా!
పెరుగు తినాల్సిందే..

చలువ పదార్థాల్లో ప్రధానమైంది. దీన్ని నేరుగా లేదా మజ్జిగ, లస్సీ, రైతా.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా కడుపులో మంటలాంటి సమస్యలు తగ్గుతాయి.

కొబ్బరి నీళ్లు

వేసవిలో.. కడుపు చల్లగా!
కొబ్బరినీళ్లు

దీనిలో ఉండే చక్కెరలు, ఎలక్ట్రోలైట్స్‌, మినరల్స్‌... హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు శరీరానికి ఎన్నో ప్రయోజనాలనూ అందిస్తాయి.

పుచ్చ, కర్బూజ

వేసవిలో.. కడుపు చల్లగా!
పుచ్చకాయతో..

ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో నీటిశాతం ఎక్కువ. ఎంత తిన్నా కడుపు భారీగా అనిపించక పోవడం అదనపు లాభం. కాకపోతే ఒకసారే ముక్కలుగా కోసుకుని ఉంచుకుని, తర్వాత తినడం వద్దు. ఎప్పటికప్పుడు తాజాగా తీసుకోవడం ఉత్తమం.

దోస

వేసవిలో.. కడుపు చల్లగా!
దోసతో స్నాక్స్

దీనిలోనూ నీటిశాతం ఎక్కువే. ఇందులో ఉండే ఫైబర్‌ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. సలాడ్‌గా అయినా, కాస్త, ఉప్పు, కారం/ మిరియాల పొడి చల్లుకుని సాయంత్రం స్నాక్‌గా అయినా తీసుకోవచ్చు.

పుదీనా

వేసవిలో.. కడుపు చల్లగా!
పుదీనా..

అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. ఇది నోటికి తాజాదనంతో పాటు శరీరానికి చల్లదనాన్నీ ఇస్తుంది. చట్నీ, రైతా, టీ మొదలైన పదార్థాల్లో భాగంగా చేసుకోవచ్చు.

ఉల్లి

వేసవిలో.. కడుపు చల్లగా!
ఉల్లి చేసే మేలు

‘ఉల్లి చేసిన మేలు.. తల్లి కూడా చేయదు’ అని నానుడి. అన్ని ఉపయోగాలున్నాయి మరి. సాధారణంగా కూరల్లో వేసుకుని దీన్ని తింటూనే ఉంటాం. కానీ వేసవిలో ఇంకా ఎక్కువగా తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండానూ రక్షణనిస్తుంది.

ఇదీ చూడండి: బేకింగ్‌ సోడా..ఉపయోగాలిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.