కోకోనట్ లావెండర్ స్క్రబ్:
అరకప్పు బ్రౌన్ షుగర్‌లో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, రెండు చుక్కల లావెండర్ ఆయిల్ కలపాలి. దీన్ని ఓ గాజు సీసాలో భద్రపరుచుకుంటే సరి. చర్మం తాజాగా, తేమగా కనిపించడానికి ఈ స్క్రబ్ సాయపడుతుంది.
స్వీట్ మింట్:
కప్పు పంచదారలో రెండు చెంచాల ఆలివ్‌నూనె, కొద్దిగా తేనె, టీ స్పూన్ పెప్పర్‌మింట్ ఎక్స్‌ట్రాక్ట్ కలపండి. ఇది రక్తప్రసరణకు తోడ్పడుతుంది. దీన్ని రోజూ రాసుకుంటే చర్మంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
వెనిల్లా కాఫీ స్క్రబ్:
కప్పు బ్రౌన్ షుగర్, పావుకప్పు కాఫీ పొడి, మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్‌నూనె, రెండు చుక్కల వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ కలిపితే సరి. ఇది ముఖవర్చస్సుని పెంచుతుంది.
పింక్‌రోజ్:
కప్పు హిమాలయన్ పింక్ సాల్ట్‌లో రెండు చెంచాల కొబ్బరినూనె, రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలిపి భద్రపరుచుకోవాలి. ఈ స్క్రబ్ ముఖాన్ని మెరిపిస్తుంది. చర్మం ఛాయని మెరుగుపరుస్తుంది. మృదువుగానూ మారుస్తుంది.