ETV Bharat / lifestyle

నిద్ర గురించి ఈ అపోహలు మీలోనూ ఉన్నాయా? - myths and facts about sleep

ఉద్యోగం చేసే రాగిణికి ఇంట్లో పనులన్నీ పూర్తయ్యే సరికే అర్ధరాత్రి అవుతుంటుంది. ఇక ఉదయాన్నే లేచి మళ్లీ పనులతో పరుగులు పెట్టాల్సిందే! ఫలితంగా ప్రయాణంలో పడుకుంటూ నిద్ర సరిపెట్టుకుంటుంది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా గ్యాడ్జెట్లతోనే గడుపుతుంటుంది మాలిని. దీంతో నిద్ర సరిపోక ఆఫీస్‌లో కునుకు తీస్తుంటుంది. సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి నిద్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే తీరిక లేని పనులు, నైట్‌ షిఫ్టులు, జీవనశైలిలో మనం చేసే కొన్ని పొరపాట్లతో పాటు నిద్ర గురించి మనలో నెలకొన్న అపోహలు మనల్ని సుఖ నిద్రకు దూరం చేస్తున్నాయి. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. అలా జరగకూడదంటే నిద్ర గురించి చాలామందిలో నెలకొన్న అపోహలు, వాటి వెనకున్న వాస్తవాలేంటో తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

all you need to know about myths and facts about sleep
నిద్ర గురించి ఈ అపోహలు మీలోనూ ఉన్నాయా?
author img

By

Published : Mar 20, 2021, 10:08 PM IST

మన జీవితకాలంలో 1/3 వంతుల సమయాన్ని నిద్రకే కేటాయిస్తామట! అంటే నిద్రకు మన రోజువారీ ప్రణాళికలో ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మన జీవనశైలిలోని కొన్ని మార్పులు, తెలిసో-తెలియకో చేసిన పలు పొరపాట్ల కారణంగా నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీని ప్రభావం మన రోజువారీ పనులు, ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటోంది. మరికొంతమందిలో నిద్ర గురించి నెలకొన్న కొన్ని అపోహలు వారిని సుఖ నిద్రకు దూరం చేస్తున్నాయి. అందుకే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

sleepdayarticlesgh650-5.jpg
పెద్దలకు ఐదు గంటల నిద్ర చాలు!

* పెద్దలకు ఐదు గంటల నిద్ర చాలు!
ఇది పూర్తిగా అపోహేనని, చాలామందిలో నెలకొన్న ఈ భావనే వారిలో నిద్రలేమికి కారణమవుతుందని, తద్వారా హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు, డిప్రెషన్‌.. వంటి లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. వయసు ఏదైనా నిద్ర సమయాల్లో తేడా ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో పెద్దలు (అడల్ట్స్‌) రాత్రుళ్లు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర పోవాలని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సూచిస్తోంది.

sleepdayarticlesgh650-3.jpg
ఎనిమిది గంటలు నిద్రకు కేటాయిస్తే సరి!

* ఏ వేళలోనైనా సరే.. ఎనిమిది గంటలు నిద్రకు కేటాయిస్తే సరి!
నైట్‌ షిఫ్టులు, ఇతర పనుల రీత్యా.. రాత్రుళ్లు పూర్తిగా నిద్ర లేకపోవడం లేదంటే ఆలస్యంగా పడుకోవడం మనలో చాలామందికి అలవాటే! అలా అప్పుడు త్యాగం చేసిన నిద్రను ఏ ప్రయాణాల్లోనో, మధ్యాహ్నమో కవర్‌ చేస్తుంటాం. దీంతో రోజులో ఎప్పుడైనా ఎనిమిది గంటలు నిద్ర పోతే సరిపోతుందనుకుంటాం. కానీ ఇది అస్సలు సరికాదంటున్నారు నిపుణులు. పైగా ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తే పర్లేదు కానీ ఇదే రొటీన్ని దీర్ఘకాలం పాటు ఫాలో అయితే మాత్రం డిప్రెషన్‌, డయాబెటిస్‌.. వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవంటున్నారు. అందుకే నిద్రకంటూ ఒక సమయం ముఖ్యమని, అది కూడా రాత్రి సమయమే సరైనదని అంటున్నారు. అలాగే పగటి పూట ఓ కునుకు (న్యాప్‌) తీసినా దాన్ని రాత్రి నిద్ర వేళలతో కలపకుండా రాత్రుళ్లు సుఖంగా ఏడెనిమిది గంటలు నిద్ర పోవడం ఆరోగ్యదాయకం అని సూచిస్తున్నారు.

sleepdayarticlesgh650-2.jpg
కళ్లు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి

* అలా కళ్లు మూసుకొని విశ్రాంతి తీసుకుంటే, నిద్ర పోయినంత ఫలితం ఉంటుంది.
శరీరానికి, మనసుకు కాస్త విశ్రాంతినివ్వడానికి చాలామంది కాసేపు కళ్లు మూసుకొని అలా రిలాక్సవుతుంటారు. అంతమాత్రాన నిద్రపోయినట్లు కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే మనం నిద్రలో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు మన శరీర అవయవాల పనితీరు వేర్వేరుగా ఉంటుందట! ముఖ్యంగా సాధారణంగా విశ్రాంతి తీసుకోవడం కంటే నిద్రపోయినప్పుడు మన మెదడు మరింత రిలాక్సయి ఆలోచన సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే సమర్థత పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే విశ్రాంతి తీసుకోవాలనుకున్న ఆ కొద్ది సమయంలో కూడా ఓ చిన్న కునుకు తీయడం మంచిదని సలహా ఇస్తున్నారు. తద్వారా శరీర అవయవాలు మరింత చురుగ్గా పనిచేస్తాయంటున్నారు.

sleepdayarticlesgh650-4.jpg
బెడ్‌లైట్‌లో నిద్ర పోవడం మంచిదే!

* బెడ్‌లైట్‌లో నిద్ర పోవడం మంచిదే!
రాత్రుళ్లు బెడ్‌లైట్‌ లేనిదే మనలో చాలామందికి నిద్ర పట్టదు. ఎందుకని అడిగితే.. చీకటి అంటే భయమనో, వెలుతురు లేనిదే నిద్ర పట్టదనో చెబుతుంటారు. పైగా ఇలా లైట్‌ వేసుకొని పడుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందేమీ ఉండదనుకుంటారు. కానీ వెలుతురులో పడుకుంటే పదే పదే మెలకువ రావడం, దాంతో ఆ తర్వాత నిద్ర పట్టకపోవడం.. వంటి సమస్యలొచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఇది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుందట! అంతేకాదు.. వెలుతురు కళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతూ ఇతర కంటి సమస్యలకు కారణమవుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీవీ వెలుతురు లేదంటే లైట్‌ వెలుతురులో నిద్ర పోయే మహిళలు క్రమంగా బరువు పెరిగే అవకాశం ఉందని, ఇదిలాగే కొనసాగితే కొన్నాళ్లకు వారు స్థూలకాయులుగా మారే ప్రమాదమూ లేకపోలేదని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే ఇక నుంచైనా పడకగదిలో లైట్లు ఆపేసి.. పూర్తి చీకట్లో పడుకోమని సూచిస్తున్నారు నిపుణులు.

sleepdayarticlesgh650-1.jpg
బెడ్‌పై కాసేపు దొర్లితే నిద్ర దానంతటదే వస్తుంది!

* బెడ్‌పై కాసేపు దొర్లితే నిద్ర దానంతటదే వస్తుంది!
ఇలా బెడ్‌పై పడుకోగానే అలా నిద్ర పట్టేస్తుంది కొందరికి! అదే మరికొంతమందైతే నిద్ర కోసం పాట్లు పడుతుంటారు. మంచంపై పడుకొని అటూ ఇటూ దొర్లుతుంటారు.. ఇలా చేస్తే కాసేపటికి మనమే నిద్రలోకి జారుకుంటాం అనుకుంటారు. కానీ ఇది అస్సలు కరక్ట్‌ కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే నిద్ర రాకపోయినా మనం మంచంపై దొర్లడం, బలవంతంగా కళ్లు మూసుకొని పడుకోవడం వల్ల మనలో చిరాకు ఆవహిస్తుందట! ఎంతకీ నిద్ర పట్టట్లేదన్న ఒత్తిడి కలుగుతుందట! అంతిమంగా దీని ప్రభావం మన మెదడుపై పడుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే.. నిద్ర పట్టకపోతే మంచానికి దూరంగా వచ్చి కాసేపు అటూ ఇటూ తిరగడం, నచ్చితే ఓ పుస్తకం చదవడం, వినసొంపైన సంగీతం వినడం.. వంటివి చేయమంటున్నారు. అలాగని గ్యాడ్జెట్స్‌తో గడపడం, టీవీ చూడడం కూడదంటున్నారు. ఎందుకంటే అవి మనల్ని నిద్రకు ప్రేరేపించడం కాదు.. నిద్రను మనకు దూరం చేస్తాయి.. అందుకే ఇలా కాసేపు రిలాక్సయ్యారంటే ఎంచక్కా నిద్ర మనల్ని ఆవహిస్తుంది. ఆపై బెడ్‌పై హాయిగా పడుకోవచ్చు..!

సో.. ఇవన్నీ చదువుతుంటే రోజులో ఎప్పుడు నిద్ర పోయినా, పోకపోయినా రాత్రుళ్లు మాత్రం ప్రతి ఒక్కరికీ ఎనిమిది గంటల సుఖ నిద్ర అత్యవసరం అన్న విషయం అర్థమవుతోంది కదూ! మరి, అనవసరమైన పనులతో, గ్యాడ్జెట్స్‌తో సమయం వృథా చేయకుండా రాత్రుళ్లు త్వరగా పడుకోండి. నిద్రలేమి ప్రభావం మరుసటి రోజుపై పడకుండా జాగ్రత్తపడండి.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి!

ఇదీ చూడండి: జొమాటో ఐపీఓ.. వచ్చే నెల సెబీకి దరఖాస్తు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.