ETV Bharat / lifestyle

మహిళలూ.. ఈ జాగ్రత్తలతో ఆ ఇబ్బందులు రావు! - పడుకునేముందు పాటించాల్సిన చిట్కాలు

బడలిక, అలసట, సమయం లేక పోవడం.. కారణాలేవైనా మనలో చాలామంది మహిళలు నిద్రపోయే ముందు తీసుకోవాల్సిన చిన్నపాటి జాగ్రత్తలూ తీసుకోరు. దాంతో రకర కాల ఇబ్బందు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే...

Women has to take these precautions before going to bed
మహిళలూ.. ఈ జాగ్రత్తలతో ఆ ఇబ్బందులు రావు!
author img

By

Published : Oct 6, 2020, 9:43 AM IST

మీరు రోజూ రాత్రి పడుకునే సమయంలో కూడా బ్రా వేసుకునే నిద్రపోతారా? అయితే అలవాటును ఇక నుంచైనా మానుకోవాలి. బిగుతుగా ఉండే దీని స్ట్రైప్స్ వల్ల రక్తసరఫరా సరిగా జరగదు. దాంతో గుండెలో నొప్పి రావొచ్చు. అలాగే ఛాతి కింద చర్మం ఎర్రగా మారడం, మంట పుట్టడం, దురద... లాంటి లక్షణాలు కనిపించవచ్చు. బిగుతుగా ఉండే వాటిని ధరించడం వల్ల రొమ్ములో ఉండే కణజాలం దెబ్బ తింటుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు రావడానికి కారణం కావొచ్చు. కాబట్టి నిద్రపోయే సమయంలో దీన్ని వేసుకోకపోవడమే మంచిది.

బిగుతుగా ఉండే దుస్తులు..

రాత్రి పడుకునే సమయంలో వదులుగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. అప్పుడే రక్త ప్రసరణ సాఫీగా సరిగా జరుగుతుంది ఉదయం నుంచి వేసుకున్న దుస్తులు చెమట, దుమ్ము, హానికారక సూక్ష్మజీవులు నిండి ఉంటాయి. వీటితోనే నిద్రపోతే జబ్బులొస్తాయి. కాబట్టి వీటిని తొలగించి వదు లాగా ఉండే నైట్ డ్రెస్ వేసుకోవాలి.

లోదుస్తులు

వీటిని ధరించి నిద్రపోవడం వల్ల వ్యక్తిగత భాగాల్లో అసౌకర్యంగా ఉంటుంది. అధిక తేమ, వేడి వల్ల అక్కడ ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

కేశాలంకరణ వస్తువులు

జుట్టుకు పెట్టుకునే పిన్నులు, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ లాంటివి తీయరు. నిద్రలో అవి మాడుకు గుచ్చుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నింటిని తీసి హాయిగా నిద్రపోవాలి.

మేకప్

దీన్ని తొలగించకపోతే చర్మం పాడవుతుంది. కాబట్టి మీరెంత బిజీగా ఉన్నా.. అలసిపోయినా సరే మేకప్​ తొలగించుకుని ముఖాన్ని శుభ్రం చేసుకున్నాకే నిద్రపోవాలి.

ఇదీ చదవండిః ఆ సందర్భాల్లో అలంకరణ అస్సలొద్దు...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.