ETV Bharat / lifestyle

ఇంట్లో దొరికే పదార్థాలతో.. ముఖంపై ముడతలు మటుమాయం!

ముఖంపై ఏర్పడే ముడతలు... మనకున్న వయసుకన్నా పెద్దవాళ్లలా కనపడేట్లు చేస్తాయి. ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ముడతల్ని దూరం చేసుకుని, ఈ సమస్యను పరిష్కరించుకోవచ్ఛు.

Tips to get rid of wrinkles
Tips to get rid of wrinkles
author img

By

Published : Aug 10, 2020, 11:58 AM IST

నాలుగు బాదం గింజల్ని నాలుగు చెంచాల పచ్చి పాలలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పైపొట్టు తీసి మెత్తని మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ముడతలు తగ్గుతాయి.

  • ఆలివ్‌నూనెలోని విటమిన్‌, ఎ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు... చర్మం పాడవకుండా కాపాడతాయి. అందుకే అరచెంచా ఆలివ్‌నూనె, కొన్ని చుక్కల తేనె, గ్లిజరిన్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో ముఖానికి రాసుకుని పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీంతో మృతకణాలు తొలగిపోతాయి, చర్మం బిగుతుగా మారుతుంది.
  • గుప్పెడు మెంతి ఆకుల్ని మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే ఫలితం ఉంటుంది.
  • కలబంద గుజ్జును ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి. దీంట్లో ఉండే ఆమ్ల గుణాలు చర్మం బిగుతుగా అయ్యేందుకు సాయపడతాయి. దీనివల్ల ముడతలు తగ్గుముఖం పడతాయి.
  • క్యారెట్‌లోని విటమిన్‌ ‘ఎ’... చర్మాన్ని మృదువుగా మార్చే కొలాజిన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. క్యారెట్‌ను నీళ్లలో వేసి మరిగించాలి. వీటిని మెత్తగా చేసి చెంచా తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. సమపాళ్లలో క్యారెట్‌ రసం, తేనె కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకున్నా ఫలితం ఉంటుంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.