ETV Bharat / lifestyle

నలభైల్లోనూ ఇలా నాజూగ్గా ఉండాలనుకుంటున్నారా?

వయసు పైబడుతున్నకొద్దీ అనారోగ్యాలతో పాటు మానసిక ఒత్తిళ్లూ అధికమవుతుంటాయి. ఇవన్నీ శారీరక, మానసిక కుంగుబాటుకు దారితీస్తాయి. మరి వీటన్నింటినుంచీ బయటపడాలంటే.. వయసుతో నిమిత్తం లేకుండా జపించాల్సిన మంత్రం ఒకటుంది.. అదే 'వ్యాయామం'. అలాగే కొంతమంది వయసు పెరుగుతున్నా అందం తరగకూడదనుకుంటారు. ఎప్పటికీ నాజూగ్గానే ఉంటే బాగుండునని భావిస్తుంటారు. ఇందుకు తగిన సౌందర్య చిట్కాలు పాటించడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం.. వంటివి చేస్తుంటారు. మరి వీటికి వ్యాయామం కూడా జతచేస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నలభైల్లో ఉన్నప్పుడు వ్యాయామం ద్వారా నాజూగ్గా తయారవ్వాలంటే ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం రండి..

నలభైల్లోనూ ఇలా నాజూగ్గా ఉండాలనుకుంటున్నారా?
నలభైల్లోనూ ఇలా నాజూగ్గా ఉండాలనుకుంటున్నారా?
author img

By

Published : Feb 12, 2021, 2:24 PM IST

మొదలుపెట్టే ముందు..

బరువు తగ్గడం, అందం, ఆరోగ్యం.. ఇలా మనకు నచ్చిన దాని గురించి ఎవరైనా మనకు ఏదైనా విషయం చెబితే వెంటనే దాన్ని ఆచరణలో పెట్టే వరకు మనసు కుదుటపడదు కదండీ. అలాగే నలభైలలో ఫిట్‌గా ఉండడం కోసం ఈ చిట్కాలు పాటించాలి, ఫలానా వ్యాయామాలు చేయాలి.. అని ఎవరైనా చెప్పగానే వెంటనే ఆచరణలో పెట్టే పనిలో నిమగ్నమవుతాం. కానీ దానికంటే ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని మరొకటుంది. అదేంటంటే.. హెల్త్ చెకప్. నలభైల్లో వ్యాయామం ప్రారంభించేముందు డాక్టర్ దగ్గరికి వెళ్లి శరీరంలోని అన్ని అవయవాల పనితీరు, ఆరోగ్యం.. తదితర అంశాల గురించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఇలా వ్యాయామం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధం అని డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే వ్యాయామం ప్రారంభించడం ఆరోగ్యానికి మంచిది.

ఏది చేస్తే మంచిది..?

వ్యాయామం చేయాలి.. ఫిట్‌గా తయారవ్వాలి.. అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఏ వ్యాయామం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అందరికీ తెలియకపోవచ్చు. కొందరికి మానసిక ఒత్తిళ్లు పెద్ద సమస్య అయితే, మరికొందరికి అధిక బరువు కావచ్చు. కాబట్టి వీటినుంచి బయటపడడానికి ఎలాంటి వ్యాయామం, ఎంతసేపు చేయాలి.. వంటి విషయాల్ని సంబంధిత ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌ని ఆశ్రయించి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవాలి. తద్వారా మీరు అనుకున్న ఫలితం త్వరగా దక్కే అవకాశం ఉంటుంది.

fitin40s650-2.jpg
నలభైల్లోనూ ఇలా నాజూగ్గా ఉండాలనుకుంటున్నారా?

వార్మప్ ముఖ్యం..

ఏ పనైనా కొత్తగా చేయడం ప్రారంభిస్తే.. అది కాస్త అలవాటయ్యే దాకా సరిగ్గా చేయాలనిపించదు. వ్యాయామం కూడా అంతే. పైగా ఇది కాస్త కష్టంతో కూడుకున్న పని కాబట్టి అసలే చేయాలనిపించదు. కాసేపు చేయగానే అలసట, నీరసం వచ్చేస్తుంటుంది. కొంతమందైతే 'అబ్బ.. చాలా కష్టంగా ఉంది.. ఈరోజుకి వద్దులే..' అనో లేదంటే 'రేపట్నుంచి మొదలుపెట్టి రోజూ చేద్దాంలే..' అనో దాటవేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల దానిపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాయామం చేయడానికి ముందు వార్మప్ చేయడం మంచి పద్ధతి. దీనివల్ల కండరాలకు, శరీర అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి, అవి ఫ్లెక్సిబుల్‌గా తయారవుతాయి. అంతేకాదు.. శరీరం, మనసు వ్యాయామం చేయడానికి సులభంగా సిద్ధమవుతాయి. ఈ సమయంలో వ్యాయామం చేయడం సులభమవుతుంది. కాబట్టి నేరుగా వ్యాయామం మొదలుపెట్టడం కాకుండా.. ముందుగా వార్మప్ చేయడం మంచిది. అలాగే చేసే వ్యాయామం కూడా నెమ్మదిగా ప్రారంభించి.. క్రమంగా దాని వేగాన్ని పెంచడం ఉత్తమం.

iidietfoodmasdnk650-1.jpg

ఆహార నియమాలు కూడా..

వ్యాయామం చేసేటప్పుడు ఏది పడితే ఆ ఆహారం తీసుకుంటామంటే కుదరదు. ఇలా చేయడం వల్ల వ్యాయామం చేసిన ఫలితం దక్కకపోవచ్చు. కాబట్టి ఈ వయసులో వ్యాయామం ప్రారంభించే ముందు ఏ వ్యాయామం చేయాలి.. అనే విషయంపై ఫిట్‌నెస్ నిపుణుల సలహా తీసుకున్నప్పుడే.. ఆ సమయంలో తీసుకునే ఆహార నియమాల గురించి కూడా తెలుసుకుంటే మంచిది. ఇది కూడా ఫిట్‌గా ఉండడానికి తోడ్పడుతుంది.

fitnesstrendasass650-4.jpg

ఆస్వాదిస్తూ..

వ్యాయామం చేయడానికి అలవాటుపడాలంటే కాస్త కష్టంగానే అనిపించచ్చు. కొంత సమయం కూడా పడుతుంది. అలవాటు కాలేదు కదాని దానిపై ఆసక్తి చూపకుండా ఏదో చేశాంలే.. అన్నట్లుగా చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి వ్యాయామంపై ఆసక్తి పెంచుకునే మార్గాల గురించి అన్వేషించాలి. ఇందులో భాగంగా ఒంటరిగా చేయడం కాకుండా జిమ్‌కి వెళ్లడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో చేయడం, సంగీతం వింటూ ఎక్సర్‌సైజ్ చేయడం, ఎప్పుడూ ఒకటే వ్యాయామం కాకుండా కొన్నిరోజులకు వ్యాయామాన్ని మార్చడం.. వంటి వివిధ పద్ధతుల్ని పాటించడం వల్ల ఎక్సర్‌సైజ్‌పై క్రమంగా ఆసక్తి పెరుగుతుంది. అలాగే వ్యాయామాన్ని కష్టపడి కాకుండా ఇష్టంతో ఆస్వాదిస్తూ చేస్తే దానిపై మక్కువ పెరగడంతో పాటు చక్కటి ఫిట్‌నెస్ కూడా సొంతమవుతుంది.

నలభైల్లో ఫిట్‌గా, నాజూగ్గా ఉండాలంటే ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలో తెలుసుకున్నారు కదా! మరి మీరు కూడా వీటిని ప్రయత్నించి వయసుతో సంబంధం లేకుండా మంచి ఫిట్‌నెస్‌ని, అందాన్ని సొంతం చేసుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.