ETV Bharat / lifestyle

ఉరుకుల పరుగుల జీవితంలో.. అందాన్ని కాపాడుకోండిలా!

అసలే ఉరుకుల పరుగుల జీవితం. ఈ క్రమంలో అందాన్నీ, ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి. ఒత్తిడీ, అలసటా తగ్గించుకోవాలి. ఎలాగబ్బా... అని ఆలోచిస్తున్నారా? ఒంటికీ, తలకీ నూనె పట్టించి మర్దనా చేయండి. మీరు కోరుకున్న ఫలితాలన్నీ మీ సొంతం అవుతాయి.

coconut oil tips for brighter face
ఉరుకుల పరుగుల జీవితంలో.. అందాన్ని కాపాడుకోండిలా!
author img

By

Published : Sep 14, 2020, 1:32 PM IST

కొబ్బరి నూనెతో...

కొబ్బరి నూనెలో విటమిన్‌-ఇ గుణాలు ఎక్కువ. దీన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒంటికి రాయండి. ఆపై మృదువుగా కాసేపు మర్దనా చేయండి. ఇలా చేస్తే పొడిబారి పగిలిన చర్మం త్వరగా సాధారణ స్థితికి వస్తుంది. ఈ నూనెకు ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాల వల్ల చర్మ సంబంధిత సమస్యలూ దరిచేరవు. వయసు పైబడడం వల్ల వచ్చే ముడతలు త్వరగా రావు. కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి. కొబ్బరి నూనెను తలకు రాసుకొని మర్దనా చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా రంగు మారవు. జుట్టు ఒత్తుగా పెరగడానికీ ఇది ఉపయోగపడుతుంది.

ఆలివ్‌ నూనెతో...

పొడి చర్మం ఉన్న వారు ఆలివ్‌ నూనెతో మసాజ్‌ చేసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది నిగారింపుగా కనిపిస్తుంది. ఎండవేడికి కమిలిన, రంగు మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. కాంతివంతంగానూ మారుతుంది. ఈ నూనెతో మర్దనా చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. ఆలివ్‌ నూనెను తలకు పట్టించి కాసేపు మర్దనా చేస్తే తలనొప్పి తగ్గుతుంది. చుండ్రు సమస్య అదుపులోకి వస్తుంది.

ఇదీ చదవండిః పీచు పదార్థాలతో... కొలెస్ట్రాల్‌ బయటకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.