బాదం నూనె:
చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. దీంట్లోని విటమిన్-ఇ ముడతలను మాయం చేస్తుంది. ఈ నూనెను స్నానానికి ముందు ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. అలానే రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి రాసుకున్నా ఫలితం ఉంటుంది.
ఆలివ్ ఆయిల్:
గాఢత ఎక్కువగా ఉండే దీన్ని నేరుగా వాడకూడదు. రెండు చుక్కల ఆలివ్ ఆయిల్‌ను కొబ్బరినూనెలో కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది. దీంట్లోని విటమిన్-ఎ, డి, ఇ, కె చర్మానికి తగిన తేమను అందించడంతోపాటు ప్రకాశవంతంగానూ మారుస్తాయి.
నువ్వుల నూనె:
పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవాళ్లు కూడా దీన్ని వాడొచ్చు. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు, యంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలూ, మచ్చలనూ తగ్గిస్తాయి.
జొజోబా ఆయిల్:
ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీంట్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికం. సీబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అంతేకాదు గాయాలు త్వరగా మానేలానూ చేస్తుంది.
* ఏ నూనె వాడినా మామూలుగా రాసి వదిలేయకుండా.. సవ్య, అపసవ్య దిశల్లో మర్దనా చేస్తే చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.