ETV Bharat / lifestyle

చిన్నారి గడుగ్గాయిలకు అతుక్కుపోయే దుస్తులు.. - magnetic dresses for kids

కాళ్లూ చేతులూ ఆడిస్తూ అస్తమానం కదిలే చంటి పిల్లలకు బట్టలు వేయడం చాలా కష్టం. అలాంటి గడుగ్గాయిలకి మ్యాగ్నెటిక్ బట్టలు వేయడం చాలా తేలిక.

magnetic dresses for children
చిన్న పిల్లల కోసం మ్యాగ్నెటిక్ బట్టలు
author img

By

Published : Oct 1, 2020, 8:05 PM IST

చంటి పిల్లకు బట్టలు వేయడం తల్లికి పెద్ద టాస్కు. గబగబా దొర్లుతున్నపుడో లేదా చకచకా పాకుతున్నపుడో షర్టుకి గుండీలు పెట్టడం ఎంత పెద్ద ప్రహసనమో చంటి పిల్లలున్న తల్లులకే తెలుస్తుంది. మరి అలాంటి గడుగ్గాయిలకి మ్యాగ్నెటిక్‌ బట్టలు వేయడం చాలా తేలిక. వీటికి గుండీలూ, జిప్పుల వంటివేమీ ఉండవు. వాటి స్థానంలో లోపలి భాగంలో అయస్కాంతం అమర్చుతారు.

పిల్లలకు ఆ దుస్తులు వేసి గుండీలు ఉండే చోట అంచుల్ని ఒకదాని దగ్గరకు ఒకటి తెస్తే అవే అతుక్కుపోతాయి. వారి వెంటపడి గుండీలు పెట్టాల్సిన బాధ కూడా ఉండదు. అలానే తీయడం కూడా చాలా సులువు. పసిపిల్లల దగ్గర్నుంచీ రెండుమూడేళ్ల చిన్నారులకు ఈ తరహాలో రకరకాల డిజైన్లలో నైట్‌వేర్‌, షర్టులూ, స్వెటర్లూ అందుబాటులో ఉంటున్నాయి. ఇవి ఆన్‌లైన్‌లో పలు ఈ కామర్స్‌ సైట్లలో దొరుకుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.