అమ్మాయిలు తాము ఎంచుకునే దుస్తులు, నగలు వంటివి అందంగా ఉండాలని మాత్రమే కోరుకోరు. వాటిలో తమ అభిరుచీ కనిపించాలని అనుకుంటారు. తమ స్టైల్‌ను ఎప్పటికప్పుడూ మారుస్తూనే.. తమకు ఇష్టమైన వాటిని ధరించేస్తూ ఉంటారు.
అలాంటివే ఈ మురళీ డిజైను పెండెట్లు. ప్రేమకు ప్రతిరూపమైన మురారికి ఎంతో ఇష్టమైన ఈ వాద్యాన్ని అందంగా తమ నగల్లో అమర్చేసుకుంటున్నారు. ఆకులు, రుద్రాక్షలు, కృష్ణుడి ప్రతిమల్లో... ఇలా రకరకాల రూపాల్లో ఇవి చూడచక్కగా ఇమిడిపోతున్నాయి. అలాంటివాటిలో ఇవి కొన్ని డిజైన్లు.
ఇదీ చదవండిః మెడలోనే గుడి కడుతున్నారు!