ఏ డే లైక్ రాయల్ పేరిట ప్రదర్శన ట్రెండో మీటర్‌గా పేరొందిన ప్రముఖ కాంచీపురం చీరల సరికొత్త కలెక్షన్ రాజధాని వాసులకు అందుబాటులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో 'ఏ డే లైక్ రాయల్ ' పేరిట ప్రదర్శన కొలువుదీరింది. శీష్ మహల్ శీర్షికన టర్కిష్ సంప్రదాయ కళాత్మకతతో వీటిని రూపొందించారు. ఇందులో కాంచీపురం చీరలు, అప్పెరల్స్ లెహంగాలు, గౌన్లు, లచాస్, అనార్కలి జాకెట్లలను వస్త్రాభిమానులకు అందుబాటులో ఉంచారు.
మగువ వివాహ సమయంలో మహారాణిల మెరిసిపోయేలా యాంటిక్ జరీ, గోల్డెన్ సిల్వర్ జరీ, టిష్యూ షిమ్మర్ శారీలు, జమావర్ డిజైనర్ శారీలు మొదలైనవి అందిస్తున్నట్లు డిజైనర్ బీనా కన్నన్ పేర్కొన్నారు.
మహిళల అభిరుచులకు అద్దంపట్టే ఈ కాంచీపురం డిజైన్ల ప్రదర్శన రేపటి నుంచి అందరికి అందుబాటులో ఉండనున్నాయి.