ETV Bharat / lifestyle

సన్‌బర్న్‌కి సహజసిద్ధంగా సెలవిద్దామిలా..!

వేసవి కాలంలో చాలామందికి ఎదురయ్యే సమస్యల్లో చర్మం కందిపోయి నల్లగా మారడం కూడా ఒకటి. మరి, అలా జరగకుండా ఉండడానికే బయటికి వెళ్లేముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటాం.. అంటారా..? అయితే సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలతో పోరాడే శక్తి ఈ లోషన్ల కంటే మనం ఆహారంగా తీసుకునే కొన్ని పదార్థాలకే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ఉండే కొన్ని రకాల పోషకాలు, సమ్మేళనాలే ఎండ చర్మంపై పడినప్పుడు కందిపోకుండా కాపాడతాయట. మరింకెందుకాలస్యం.. ఆ పదార్థాలేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోతే సరి..!

sunburn
sunburn
author img

By

Published : May 14, 2021, 12:14 PM IST

sunburnasjkdiasd650-1.jpg
పండ్లు

ఈ పండ్లు..

ఎండ కారణంగా చర్మం కందిపోకుండా ఉండడానికి పండ్లు ఎంతగానో సహకరిస్తాయి. ముఖ్యంగా దానిమ్మ, స్ట్రాబెర్రీ, జామ.. వంటి పండ్లలో ఉండే పోషకాలు ఇందుకు బాగా దోహదం చేస్తాయి. దానిమ్మలో పుష్కలంగా లభించే ఎల్లాజిక్ ఆమ్లం సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు మేనుపై పడకుండా అడ్డుకుంటుంది. అలాగే చర్మంలో కొత్త కణాలను ఉత్పత్తి చేసి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇక స్ట్రాబెర్రీలో అధికంగా లభించే విటమిన్ సి కూడా ఈ సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. అలాగే బ్లూబెర్రీ, రాస్బెర్రీ.. వంటివి కూడా ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఏ కాలంలోనైనా విరివిగా లభించే జామ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంతో పాటు చర్మ క్యాన్సర్, ఇతర మేని సంబంధిత సమస్యలు రాకుండా సంరక్షిస్తాయి. వీటితో పాటు పుచ్చకాయ, కివీ, యాపిల్.. వంటి పండ్లూ చర్మానికి ఎండ నుంచి రక్షణ కల్పిస్తాయి.

canceravoidfoods650-4.jpg
గ్రీన్ టీ

గ్రీన్ టీ తాగారా?

గ్రీన్ టీ.. అధిక బరువు సమస్యతో బాధపడేవారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేవారు ఈ టీ తాగుతుంటారు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పరంగా దోహదం చేయడం మాత్రమే కాదు.. ఎండ నుంచి చర్మానికి తగిన రక్షణ సైతం కల్పిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే టానికామ్లం, ఇతర సమ్మేళనాలు ఎండ కారణంగా చర్మం కందిపోకుండా కాపాడతాయి. కాబట్టి ఎవరైతే రోజూ గ్రీన్ టీ తాగుతారో వారికి సన్‌బర్న్ సమస్య చాలా తక్కువగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు.

sunburnasjkdiasd650-3.jpg
టొమాటో

టొమాటోతో టాటా..

మార్చితో మొదలయ్యే ఎండలు దాదాపు జూన్ వరకూ కొనసాగుతాయి. ఈ మూడునాలుగు నెలల పాటు చర్మాన్ని ఎండ నుంచి సంరక్షించుకోవాలంటే కొద్దిగా ఆలివ్ నూనెలో పావు కప్పు టొమాటో పేస్ట్‌ను కలుపుకొని రోజూ తీసుకోవడం వల్ల సూర్యరశ్మి వల్ల చర్మం కందిపోకుండా జాగ్రత్తపడచ్చు. ఎందుకంటే టొమాటోలో ఎక్కువగా లభించే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి అధిక సమయం రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు.. ఈ రెండు పదార్థాలూ ఆరోగ్యానికీ ఎంతో మంచివి.

sunburnasjkdiasd650.jpg
దుంప

దుంపతో సమస్య దూరం..

బంగాళాదుంప.. దీంతో చేసిన వంటకాలంటే మనలో చాలామందికి ఇష్టం. అయితే ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడడంలో బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పిండి పదార్థాలు ఎండ వల్ల చర్మం కందిపోకుండా రక్షిస్తాయి. దీనికి మీరు చేయాల్సిందల్లా బంగాళాదుంపను మెత్తగా చేసుకొని చర్మంపై ఎండ తగిలే ప్రదేశంలో రాస్తే సరి.. అంతేకాదు.. ఇది మేని మెరుపుకూ ఉపయోగపడుతుంది.

ఇవి కూడా..

sunburnasjkdiasd650-2.jpg
  • కీరాదోస ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించి చల్లదనాన్ని ఇవ్వడం మాత్రమే కాదు.. సూర్యరశ్మి నుంచి కూడా చర్మాన్ని కాపాడుతుంది. అందులో అధికంగా ఉండే నీటి శాతమే దీనికి కారణం.
  • క్యారట్లు, చిలగడదుంపలో ఉండే బీటా కెరోటిన్ కూడా సూర్యరశ్మి ప్రభావం శరీరంపై పడకుండా కాపాడుతుంది.
  • కొంతమంది సలాడ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటివారు బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు.. వంటివి సలాడ్లలో భాగం చేసుకోవాలి. ఫలితంగా వీటిలో ఉండే విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు.. వంటివన్నీ ఎండ వల్ల చర్మం కందిపోకుండా రక్షిస్తాయి.
  • ముదురు రంగుల్లో ఉండే కూరగాయలు, ఆకుకూరల్ని సైతం ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు.. ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
  • వీటన్నింటితో పాటు కలబంద, ఓట్స్, మజ్జిగ.. వంటివి కూడా ఎండ కారణంగా చర్మం కందిపోకుండా సంరక్షిస్తాయి. కాబట్టి మీరూ వీటన్నింటినీ మీ ఆహారంలో భాగం చేసుకోవడం లేదంటే చర్మానికి అప్త్లె చేసుకోవడం.. వంటివి చేస్తే ఎండ నుంచి రక్షణ పొందచ్చు.

ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.