ETV Bharat / lifestyle

పొడిబారిన, జిడ్డు కారుతున్న ముఖానికి పెరుగుతో చెక్! - ముఖ సౌందర్యానికి పెరుగు చిట్కాలు

ఈ కాలంలో ముఖం ఒక్కోసారి జిడ్డు కారుతుంది. కొన్నిసార్లు పొడిబారిపోతుంది. నిజానికి ఈ రెండూ ఇబ్బంది పెట్టే సమస్యలే. వీటిని పెరుగుతో దూరం చేయొచ్చు. అదెలాగంటే...

face glows after using tips with curd
పొడిబారిన, జిడ్డు కారుతున్న ముఖానికి పెరుగుతో చెక్!
author img

By

Published : Jul 24, 2020, 9:50 AM IST

జిడ్డుపోవాలంటే: బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకుని టేబుల్‌స్పూన్‌ పెరుగు వేసి బ్లెండర్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్క్రబర్‌: అరకప్పు పెరుగులో రెండు టీస్పూన్ల సెనగపిండి, టొమాటో రసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించిన ఐదు నిమిషాలు తర్వాత సవ్య, అపసవ్య దిశల్లో మర్దన చేయాలి. ఆ తర్వాత చన్నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

మచ్చలు పోవడానికి: కొంచెం పెరుగులో టీస్పూన్‌ పసుపు వేసి కలపాలి. దీన్ని ముఖానికి మెడకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి.

మెరవాలంటే: రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగులో రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మొటిమలు మాయం: అరకప్పు పెరుగులో రెండు టీస్పూన్ల ఆలివ్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం మీదుండే చిన్న చిన్న మొటిమలు మాయమవుతాయి.

ఇదీ చదవండిః ఈ ఛాయ్​లు మీ మోముకు చక్కని అందాన్నిస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.