ETV Bharat / lifestyle

సంపూర్ణ సౌందర్యానికి 'సహజ' మంత్రమేస్తున్నారు! - తెలంగాణ వార్తలు

అందమంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ముఖ సౌందర్యమే. ఈ క్రమంలో జుట్టు, గోళ్లు, పాదాల్ని మనం పెద్దగా పట్టించుకోం. కానీ నఖశిఖపర్యంతం అందంగా ఉన్నప్పుడే అది సంపూర్ణ సౌందర్యమవుతుంది.. అంటున్నారు డొమినికన్ రిపబ్లిక్ దేశానికి చెందిన ముద్దుగుమ్మలు. జుట్టు దగ్గర్నుంచి కొనగోటి వరకు తాము అందంగా మెరిసిపోవడానికి ప్రాధాన్యమిస్తామని, అందుకోసం పార్లర్ల వెంట పరుగులు తీయడం కాకుండా ఇంట్లో లభించే సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తుల్నే వినియోగిస్తామని చెబుతున్నారు. అలాంటి అందమే ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుందని ఇతర దేశాల మగువలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతున్నారు. మరి, డొమినికన్ అతివల న్యాచురల్ బ్యూటీ వెనకున్న ఆ సీక్రెట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

dominican-republic-natural-beauty-secrets-in-telugu
సంపూర్ణ సౌందర్యానికి 'సహజ' మంత్రమేస్తున్నారు!
author img

By

Published : Mar 7, 2021, 9:50 AM IST

ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు పలుమార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కామనే. అయితే ఈ క్రమంలో వివిధ రకాల సబ్బులు, ఫేస్‌వాష్‌లు ఉపయోగిస్తుంటాం. కానీ వాటిలో ఉండే రసాయనాలు అప్పటికప్పుడు ముఖాన్ని శుభ్రపరిచినప్పటికీ.. చర్మంలోని సహజసిద్ధమైన నూనెల్ని తొలగించి పొడిబారిపోయేలా చేస్తాయి. అందుకే వీటికంటే సహజసిద్ధమైన ఫేస్‌వాష్‌లే మంచివంటున్నారు డొమినికన్ భామలు.

కలబందతో..

ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు కలబందను మించింది లేదంటున్నారు. రోజూ ముఖాన్ని ఓసారి చల్లటి నీటితో శుభ్రం చేసుకొని ఆపై కలబంద గుజ్జును ముఖం, మెడ ప్రాంతాల్లో అప్త్లె చేసుకుంటుంటారు. కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే.. ముఖంపై ఉండే దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలన్నీ తొలగిపోయి శుభ్రపడుతుందనేది ఈ ముద్దుగుమ్మల బ్యూటీ సీక్రెట్. అంతేకాదు.. ఈ కలబంద ముఖంపై ఉండే మొటిమల్ని, వాటి తాలూకు మచ్చల్ని తగ్గించడంతో పాటు చర్మాన్ని తేమగా, కాంతివంతంగా, మృదువుగా మార్చుతుంది. అలాగే ఎండ వల్ల కందిన చర్మానికీ ఇది చక్కటి పరిష్కారం చూపుతుంది.

తేమనందించే ఫేస్‌ప్యాక్ ఇది!

కొన్నిసార్లు చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. చర్మంపై ఏర్పడిన పగుళ్ల కారణంగా దురద, ఎరుపెక్కడం.. వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సౌందర్య సమస్యలను దూరం చేసుకోవడానికి ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లనే ఆశ్రయిస్తుంటారు డొమినికన్ అతివలు. ఇందుకోసం కొద్దిగా ఓట్‌మీల్‌లో టీస్పూన్ తేనె కలిపి మెత్తటి మిశ్రమంగా చేసుకుంటారు. దీన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌లా వేసుకొని.. ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటుంటారు. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొందుతుంది.. అలాగే మృదువుగా, ప్రకాశవంతంగానూ మారుతుంది.

పట్టులాంటి జుట్టుకు అవకాడో!

కాలుష్యం, మనం తీసుకునే ఆహారం.. వంటివి మన చర్మ ఆరోగ్యం పైనే కాదు.. జుట్టు ఆరోగ్యం పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా జుట్టు పొడిబారిపోవడం, గరుకుగా మారడం, రాలిపోవడం.. వంటివి సహజమే. మరి, ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలంటే పార్లర్ల వెంట పరుగులు తీయడం ఆపి.. తమలా సహజసిద్ధమైన హెయిర్‌మాస్కుల్ని ఉపయోగించమని సలహా ఇస్తున్నారు డొమినికన్ భామలు. ఈ దేశపు మగువలు తమ జుట్టును పట్టుకుచ్చులా మెరిపించుకోవడానికి అవకాడోతో చేసిన హెయిర్‌మాస్కు వేసుకుంటుంటారు. ఇందుకోసం ఒక అవకాడో గుజ్జుకు, కాస్త మయొనీజ్ ఛీజ్ కలిపి మృదువైన మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల దగ్గర్నుంచి చివర్ల వరకు మాస్కులా అప్త్లె చేసుకొని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా, పట్టులా మెరుస్తుంది.. ఈ మాస్క్‌తో కుదుళ్లు బలంగా మారడంతో పాటు జుట్టు రాలే సమస్య కూడా అదుపులోకి వస్తుంది.

జుట్టుకు కొబ్బరినూనె మంత్రం!

చలికాలంలో చర్మమే కాదు.. జుట్టు కూడా తేమను కోల్పోతుంది. తద్వారా జుట్టు పిచ్చుక గూడులా గజిబిజిగా తయారవుతుంది. వెంట్రుకలు ఇలా ఉంటే మనకూ చిరాగ్గానే అనిపిస్తుంది. మరి, ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది పార్లర్లకు వెళ్లి వివిధ రకాల హెయిర్ ట్రీట్‌మెంట్స్ తీసుకుంటుంటారు. కానీ వీటివల్ల జుట్టు సమస్య తగ్గడమేమో గానీ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అందుకే ఇంట్లోనే ఓ చిన్న చిట్కా పాటించి జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందించవచ్చంటున్నారు డొమినికన్ మగువలు. అదేంటంటే.. తలస్నానం చేసిన తర్వాత కాస్త కొబ్బరినూనెను కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసి మృదువుగా మర్దన చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల తేమ కోల్పోయి నిర్జీవంగా మారిన జుట్టుకు కొత్త కళ వస్తుంది. ఈ చిట్కా ద్వారా వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరగడంతో పాటు షైనీగా కనిపిస్తాయి.

వెల్లుల్లితో గోళ్లు ఆరోగ్యంగా..!

చాలామంది గోళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. తద్వారా అవి తేమను కోల్పోయి విరిగిపోవడం, పసుపు పచ్చగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యల్ని తగ్గించుకోవడానికి డొమినికన్ మగువలు పాటించే బ్యూటీ మంత్రం వెల్లుల్లి. సాధారణంగా మనం నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత షైనింగ్ కోసం దానిపై ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌తో కోటింగ్ ఇవ్వడం తెలిసిందే. ఆ ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌తోనే తమ గోళ్లను ఆరోగ్యంగా మలచుకుంటారు డొమినికన్ బ్యూటీస్. అదెలా అని ఆలోచిస్తున్నారా? సింపుల్.. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌లో వేస్తారు. పది రోజుల పాటు వాటిని అందులోనే నాననిచ్చి.. ఆపై ఆ పాలిష్‌ను ఉపయోగించడం వల్ల గోళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయని వారు చెబుతున్నారు.

వీటితో పాటు తాజా పండ్లు, కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం.. వంటివి కూడా తమ సౌందర్య రహస్యాల్లో ఓ భాగమేనంటున్నారు డొమినికన్ భామలు. ఇలా వీరు పాటించే బ్యూటీ టిప్స్ చూస్తుంటే సహజసిద్ధమైన అందాన్ని సొంతం చేసుకోవడం ఎంత సింపులో అర్థమవుతుంది కదూ!! మరి, ఆలస్యమెందుకు.. మనమూ వీరిని ఫాలో అయిపోతూ న్యాచురల్ బ్యూటీస్‌గా మెరిసిపోదామా?

ఇదీ చూడండి: 'తన సినిమాను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేశారని కేసు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.