ETV Bharat / lifestyle

Dresses For Pets: నయా ట్రెండ్‌.. పెంపుడు జంతువులకు డిజైనర్​ దుస్తులు - పెంపుడు జంతువులకు దుస్తులు

జనాల్లో ఇటీవల పెంపుడు జంతువుల పట్ల ప్రేమ పెరుగుతోంది. వాటిని సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు జంతు ప్రేమికులు. తమతో సమానంగా ఆదరిస్తున్నారు. పుట్టినరోజు, పండుగలకు డిజైనర్​ దుస్తులు కొనుక్కుంటున్నట్లుగానే.. పెంపుడు జంతువులకు కూడా ఫ్యాషన్ దుస్తులు (Dresses For Pets) కొని వేసేస్తున్నారు. ఇప్పుడు అదే మార్కెట్​గా మారింది. ఎంతో మంది ఆడవారికి ఉపాధి అయింది.

Dresses For Pets
పెంపుడు జంతువులకు డిజైనర్​ దుస్తులు
author img

By

Published : Nov 12, 2021, 2:46 PM IST

పప్పీకి గౌను తీసుకోవాలి. ఈ పండుగకు జూలీకి షేర్వాణి ఎలా అయినా తీసుకోవాలి. ఇదేమిటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా..? నిజమే ఇప్పుడు పెంపుడు జంతువులకూ ఫ్యాషన్ దుస్తులు (Dresses For Pets) అందుబాటులోకి వచ్చేశాయి మరి. హైదరాబాద్​లో నయా ట్రెండ్‌ మెుదలైంది. పండుగ వస్తే మనుషులతో పాటు పెంపుడు జంతువులకు దుస్తులు (Dresses For Pets) కొనే సంప్రదాయం వచ్చేసింది. కేపీహెచ్​బీకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ నిమిషా దీక్షిత్​కు మొదటి నుంచి తాను చేసే వృత్తిలోనే ఏదైనా కొత్తగా చేయాలనే కోరిక ఉండేది. దానితోనే ఆమె పెంపుడు జంతువులకు అందమైన వస్త్రాల (Dresses For Pets) ను తయారు చేయడం ప్రారంభించింది. తన పెంపుడు జంతువుకు కుట్టిన రెయిన్​కోట్​ చూసి అందరూ మెచ్చుకోవడంతో.. అదే తన వృత్తిగా మలుచుకున్నట్లు వెల్లడించారు. మియో అనే పెట్ స్ఫూర్తితో 'డాగ్​ ఓ బౌ (dog o bow) ' స్టార్టప్ ఐడియా వచ్చిందని తెలిపారు.

జంతు ప్రేమికులకు శుభవార్త: అందుబాటులోకి పెట్​ ఇన్సూరెన్స్‌

పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!

పెంపుడు శునకాలతో అతివల హొయలు...

శునక వైభోగం చూడతరమా!

శునకం కోసం విమానం బిజినెస్​ కేబిన్​ బుకింగ్​

మేమంతా పెంపుడు జంతువుల ప్రేమికులం. అందుకే పెంపుడు జంతువుల కోసం టాంగ్రిస్‌, టక్సిడోస్‌, షేర్వాణి, ఫ్రాక్స్‌ వంటి దుస్తులు తయారు చేస్తున్నాం. వాటికోసం బెడ్స్‌ కూడా రూపొందిస్తాం. వినియోగదారుల అభిరుచి మేరకు వస్త్రాలపై పేర్లతో పాటు విభిన్నంగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం మాకు రెండు స్టోర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్నదానికి తోడుగా బంజారాహిల్స్‌లో మరొకటి ప్రారంభిస్తున్నాం. చెన్నైలో కూడా మాకు ఫ్రాంచైజీ ఉంది. ఈ మూడేళ్లలో మేము చాలా పురోగతి సాధించాం.

-నిమిషా దీక్షిత్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌

పెంపుడు జంతువులకు డిజైనర్​ దుస్తులు

మహారాష్ట్రకు చెందిన నిమిషా హైదరాబాద్​లో స్థిరపడ్డారు. 2018లో రూ.3 లక్షలతో ప్రారంభించిన యూనిట్ ప్రస్తుతం కోటి టర్నోవర్ చేస్తోందని నిమిషా తెలిపారు. ప్రస్తుతం తన కంపెనీ (dog o bow)లో 50 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని వెల్లడించారు. మెట్రో నగరాలకు దుస్తులు సరఫరా చేస్తున్నామన్నారు. ఆడ, మగ జంతువులకు వేర్వేరుగా డిజైన్లు (Dresses For Pets) రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు కూడా డిజైన్లు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: జంతువుల పెంపకంపై అవగాహన

పెంపుడు కుక్కకు 5 మిలియన్​ డాలర్ల ఆస్తి

'విదేశీ పెంపుడు జంతువులకు అనుమతులు తప్పనిసరి'

పెంపుడు శునకం కోసం యువతి బలవన్మరణం!

పెంపుడు జంతువులపై ఇంకొంచెం ప్యార్‌ కరోనా!

పెంపుడు శునకం ప్రత్యేకతలు చెబుతూ పుస్తకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.