ETV Bharat / lifestyle

వార్డ్‌రోబ్‌లో వదులైన దుస్తులుండాలి.. - సమ్మర్ దుస్తులు

టైట్‌ ఫిట్‌, ఒంటికి పట్టినట్లుండే చుడీదార్‌, పెన్సిల్‌ జీన్స్‌ వంటి దుస్తులకు ఈ వేసవిలో కొంత విరామం ఇస్తే మంచిది అని చెబుతున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. వాటికి బదులు వదులుగా ఉండేవాటిని ఎంచుకుంటే అందమే కాదు, ఆరోగ్యమూ ఉంటుందంటున్నారు. అవేంటో చూద్దాం...

comfort-clothes-in-summer
వార్డ్‌రోబ్‌లో వదులైన దుస్తులుండాలి..
author img

By

Published : Apr 22, 2021, 2:25 PM IST

సౌకర్యంగా...

వేసవి దుస్తులను ఎంచుకునేటప్పుడు అవి మనకు సౌకర్యంగా ఉన్నాయా లేదా అని కొనే ముందు గమనించుకోవాలి. శరీరాకృతికి తగ్గట్లుగా నడుము, భుజాల వద్ద సరైన కొలతలుంటే చాలు. మిగతా డ్రెస్‌ అంతా వదులుగా ఉన్నా చూడటానికి ఆకర్షణీయంగానే ఉంటుంది. పలాజో-వదులైన టాప్‌, పైజామా-వదులు జుబ్బా, తేలికైన కాటన్‌ టాప్‌, మోకాళ్ల కింద వరకు స్కర్టు బాగుంటాయి. ఏ దుస్తులు ధరించినా మనకు సౌకర్యంగా ఉంటే అవి మనకు నప్పినట్లే.

కొత్తగా...

పొడవు గౌను ఫ్యాషన్‌ ఈ సీజన్‌లోనూ కొత్తగానే అనిపిస్తుంది. దీనికి మృదువైన వస్త్రాన్నే ఎంచుకోవాలి. చేతులు, నడుము కింద కొంత వదులుగా ఉన్నా చూడటానికి బాగుంటుంది. మోకాళ్ల వరకు వచ్చే కాటన్‌ గౌన్లు కూడా ఈ వేసవిలో బాగా నప్పుతాయి.

ఏదైనా ఓకే!...

ఇప్పుడు అమ్మాయిలు ఫలానా డ్రెస్‌లే వేసుకోవాలనేదేమీ లేదు. ట్రెండ్‌ మారింది. వదులు జుబ్బాలు, కాటన్‌ చొక్కాలు, అలాగే వదులైన డెనిమ్‌ షర్ట్స్‌లను ధరించి కొత్తలుక్‌ను తెచ్చుకోవచ్చు. సమయం, సందర్భానికి తగినట్లుగా, శరీరాకృతికి నప్పేలా ఎంచుకుంటే చాలు. అప్పుడు మీరే ఓ కొత్త ఫ్యాషన్‌కు శ్రీకారం చుట్టినవాళ్లవుతారు.

ఇదీ చూడండి: టాప్​-10 పాప్​ సింగర్​లలో ఒకదాన్నవుతా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.