చర్మం ఏదైనా:
మీది జిడ్డు, పొడి, సాధారణ చర్మం.. ఏదైనా కావచ్చు. ఈ పూతను ప్రయత్నిస్తే ముఖం చక్కగా కాంతులీనుతుంది. చెంచా యాపిల్ గుజ్జులో అరచెంచా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
మెరవాలంటే:
రెండు చెంచాల యాపిల్ గుజ్జులో చెంచా చొప్పున దానిమ్మ రసం, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేయాలి. బాగా ఆరిన తర్వాత నీళ్లతో కడిగేయాలి. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్, యాంటీఏజింగ్ లక్షణాలు కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. దాంతో ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
పాలూ గుడ్డు కలిపి:
మూడు చెంచాల యాపిల్ పేస్టులో చెంచా పాలు, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడకు రాసి ఇరవై నిమిషాలపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి ఇలాచేస్తే తేడా మీకే తెలుస్తుంది.
ఇదీ చూడండి: జంటగా చేస్తే ఆరోగ్యం.. ఆనందం..