ETV Bharat / lifestyle

పెళ్లికి ముందు మీరూ ఈ పొరపాట్లు చేస్తున్నారా?! - Tips for women's beauty

పెళ్లంటే చాలు అమ్మాయిలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు.. తమ వివాహానికి ఎంచుకునే దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్‌ దాకా ప్రతిదీ అందరికంటే భిన్నంగా, సరికొత్తగా ఉండాలని అనుకోవడం సహజం. ఇక అందం విషయంలో అయితే ఏమాత్రం రాజీపడే సమస్యే లేదంటున్నారు ఈ తరం అమ్మాయిలు! అయితే వివాహానికి ముందు ఇలా సరికొత్త ప్రయోగాలు చేయడం వల్ల అవి వికటించి పలు సౌందర్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి బ్రైడల్‌ లుక్‌ విషయంలో ముందు నుంచే ప్రణాళిక వేసుకోవడం మంచిందంటున్నారు. మరి, ఇంతకీ పెళ్లిలో అందంగా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు చేసే ఆ పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!

beauty mistakes to avoid before your wedding days in telugu
పెళ్లికి ముందు మీరూ ఈ పొరపాట్లు చేస్తున్నారా?!
author img

By

Published : Nov 11, 2020, 2:05 PM IST

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి అటు సహజసిద్ధమైన పదార్థాలతో పాటు ఇటు బయట దొరికే క్రీమ్‌లు, మేకప్‌ ఉత్పత్తులు బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే తక్షణమే మెరిసిపోవాలన్న ఉద్దేశంతోనో లేదంటే స్నేహితులు సలహా ఇచ్చారనో.. కొంతమంది పెళ్లికి నాలుగైదు రోజుల ముందు నుంచీ కొత్త సౌందర్య ఉత్పత్తులు వాడడం, తాము తరచూ వాడే బ్రాండ్‌ కాకుండా వేరే బ్రాండ్‌ మేకప్‌ ఉత్పత్తుల్ని ప్రయత్నించడం.. వంటివి చేస్తుంటారు. తద్వారా ఆ ఉత్పత్తులు మీ చర్మానికి పడచ్చు.. పడకపోవచ్చు! సున్నితమైన చర్మం ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. ఒకవేళ ఈ కొత్త ఉత్పత్తులు మీ చర్మానికి సరిపడకపోతే మొటిమలు రావడం, మచ్చలు పడడం, ఎరుపెక్కడం.. ఇలా అప్పటిదాకా అందంగా ఉన్న మీరు అందవిహీనంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్లికి నెల లేదా రెండు నెలల ముందు నుంచే ఇలాంటి ప్రయోగాలు చేయడం మానుకోండి. అలాగే ఒకవేళ మీకు మేకప్‌ అప్పటిదాకా అలవాటు లేదనుకోండి.. మేకప్‌ ఉత్పత్తులు వాడి సమస్య కొని తెచ్చుకునే కంటే మేకప్‌-ఫ్రీ లుక్‌తోనే అందంగా మెరిసిపోవచ్చు!

beautytipsbeforemarriage650-5.jpg
పెళ్లిలో అందంగా మెరిసిపోవాలంటే..

మూడు నెలల ముందే వ్యాక్సింగ్‌!

పెళ్లిలో అందంగా మెరిసిపోవాలనే ఉద్దేశంతో చేతులు, కాళ్లపై ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించుకుంటుంటారు చాలామంది అమ్మాయిలు. అయితే అప్పటిదాకా ఈ అలవాటు లేని వాళ్లు సైతం పెళ్లికి నాలుగైదు రోజులు ఉందనగా ఈ ప్రయోగం చేస్తుంటారు. అయితే ఇలా మొదటిసారి వ్యాక్సింగ్‌ చేసుకోవడం వల్ల చర్మంపై నొప్పి పుడుతుంది.. ఇందుకోసం వాడే క్రీమ్స్‌ కూడా చర్మానికి పడచ్చు పడకపోవచ్చు.. తద్వారా చర్మంపై అలర్జీ, వాపు.. వంటివి రావచ్చు. కాబట్టి ముందు నుంచీ అలవాటున్న వారు తప్ప పెళ్లికి ముందు వ్యాక్సింగ్‌ విషయంలో ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ అంతగా అవాంఛిత రోమాలు తొలగించుకోవాలనుకుంటే మాత్రం ఓసారి నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.

beautytipsbeforemarriage650-1.jpg
పెళ్లిలో అందంగా మెరిసిపోవాలంటే..

జుట్టుతో ప్రయోగాలు వద్దు!

వివాహ ముహూర్తం నిశ్చయమైన క్షణం నుంచి అలా రడీ కావాలి.. ఇలాంటి హెయిర్‌స్టైల్‌ వేసుకోవాలి అని కలలు కంటుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో యూట్యూబ్‌ వీడియోలు కూడా చూస్తుంటారు. అయితే ఎవరో కొత్త కొత్త హెయిర్‌స్టైల్‌ ప్రయత్నించినంత మాత్రాన అది మీకు నప్పచ్చు.. నప్పకపోవచ్చు..! పైగా అలాంటి హెయిర్‌స్టైల్‌ మీరూ వేసుకోవాలని పెళ్లికి ముందు మీ జుట్టును ఇష్టమొచ్చినట్లుగా కట్‌ చేయించుకుంటే మీ లుక్‌ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి జుట్టు కత్తిరించుకోకుండానే మీ బ్రైడల్‌ లుక్‌కి సరిపోయేలా ఉండే చక్కటి హెయిర్‌స్టైల్‌ని ఎంచుకోవచ్చు. ఎలాగూ మీ పెళ్లి మేకప్‌ కోసం ఓ మేకప్‌ ఆర్టిస్ట్‌ని మాట్లాడుకుంటారు కాబట్టి మీ లుక్‌కి సరిపోయే హెయిర్‌స్టైల్‌ ఏంటో వాళ్లే సూచిస్తారు.. అంతేకాదు.. మీరు కోరుకున్నట్లుగా మిమ్మల్ని రడీ చేస్తారు కూడా!

beautytipsbeforemarriage650-6.jpg
పెళ్లిలో అందంగా మెరిసిపోవాలంటే..

హడావిడి పేరుతో తిండిని నిర్లక్ష్యం చేయద్దు!

పెళ్లంటే షాపింగ్‌లని, బ్లౌజులు కుట్టించుకోవాలని.. ఇలా వివిధ రకాల పనులతో తీరిక లేకుండా సమయం గడుపుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో తిండి తినడం, నీళ్లు తాగడానికి కూడా వారికి తీరిక దొరకదు. ఇక తమ పెళ్లి ఊహల్లో పడిపోయి నిద్ర కూడా కరువవుతుంటుంది కొంతమంది అమ్మాయిలకు! అయితే ఇలా సరైన ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాగకుండా, నిద్ర పోకుండా ఉంటే దాని ప్రభావం అందం మీద కూడా పడుతుంది. తద్వారా ముఖంలో కళ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత పెళ్లి హడావిడిలో ఉన్నప్పటికీ వేళకు భోజనం చేయడం, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌ అవుతుంది.. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని మెరిపించడంలో సహకరిస్తాయి. ఇక కాబోయే వధువులు రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగడం, 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్ర పోవడం వల్ల పెళ్లి నాటికి పుత్తడి బొమ్మలా తళుకులీనచ్చు.

beautytipsbeforemarriage650-3.jpg
పెళ్లిలో అందంగా మెరిసిపోవాలంటే..

ఇవి గుర్తుపెట్టుకోండి!

  • ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మంపై ఎక్కడో ఒక దగ్గర చిన్న మొటిమైనా వస్తుంటుంది. అలాగని పెళ్లికి ముందు రోజుల్లో దాన్ని గిల్లితే.. సమస్య మరింత పెద్దదవుతుంది. అక్కడ చర్మంపై వాపు, నల్లబడడం, ఎరుపెక్కడంతో అందవిహీనంగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మొటిమల్ని తక్షణమే తొలగించుకోవడానికి అవసరమైతే నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు.
  • కొంతమంది పెళ్లికి రెండు రోజులుందనగా లేదంటే సమయం లేక పెళ్లికి ముందు రోజు ఫేషియల్స్‌ చేయించుకుంటుంటారు. కానీ దీనివల్ల ఎలాంటి ఫలితం కనిపించదు. అందుకే పెళ్లికి కనీసం ఐదారు రోజులు ముందే ఫేషియల్స్‌ చేయించుకుంటే పెళ్లి నాటికి ముఖం మరింత ప్రకాశవంతంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఇక వీటితో పాటు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మీరు పార్లర్‌కి వెళ్లినా, బ్యుటీషియన్‌/మేకప్‌ ఆర్టిస్ట్‌ని మీ ఇంటికి పిలిపించుకున్నా ఇద్దరూ మాస్క్‌ పెట్టుకోవడం, తరచూ చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవడం.. వంటి కనీస జాగ్రత్తలు పాటించడం మాత్రం మర్చిపోవద్దు..!

ఇదీ చదవండిః నీళ్లలో పెడితే బొమ్మొస్తుంది.. బుజ్జాయి ఏడుపు మానేస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.