ETV Bharat / lifestyle

National Handloom Day: శతాబ్దాల చేనేత సోయగం.. తగ్గని వస్త్ర'రాజసం'

శతాబ్దాల చేనేత ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు... అయినా ఈ వస్త్రరాజం వన్నె మాత్రం తగ్గలేదు. సంప్రదాయ చేనేత.. ఆధునికతను కలబోసుకుంటోంది. సరికొత్త సొబగులు అద్దుకుని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ మెప్పిస్తోంది. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day). మరి దాని సొగసు, సోయగాలను ఒకసారి పరికిద్దామా...!

National Handloom Day, handloom speciality
శతాబ్దాల చేనేత సోయగం, జాతీయ చేనేత దినోత్సవం
author img

By

Published : Aug 7, 2021, 2:25 PM IST

చేనేత(Handloom)కు శతాబ్దాల చరిత్ర ఉన్నా... ఆ వన్నె మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పైగా సరికొత్త సొబగులు అద్దుకొని అందరినీ మెప్పిస్తోంది. నేతన్న రేయింబవళ్లు శ్రమించి తయారు చేసిన చేనేత సోయగాలు వర్ణనాతీతం. అందులో నూలు చీరలు ఎంచుకున్నా ధగధగల పట్టు కట్టినా ఆ సొగసే వేరు.

చేనేత సొబగులతో మెరుస్తున్న తార

కంచి పట్టు నుంచి మంగళగిరి నూలు, డబుల్‌ ఇకత్‌ కాటన్‌ సిల్క్‌ చీర పేరేదైనా... కట్టుకుంటే మాత్రం ఎంతో సౌకర్యం. కంచి, బెనారస్‌, పోచంపల్లి ఇకత్‌, గద్వాల్‌, నారాయణ్‌పేట్‌, మహదేవ్‌ పుర్‌, మంగళగిరి, పొందూరు... ఇలా ఎన్నో ప్రాంతాల నుంచి చేనేత రకాలు ఆదరణ పొందుతున్నాయి. పట్టుతో పాటు పైథానీ, కోటా కాటన్‌, సిల్క్‌ కోటా, పటోలా, మస్లిన్‌, లినెన్‌... వంటి రకాలు రాజ్యమేలుతున్నాయి.

చేనేతతో అందం, సౌకర్యం

ఒకప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్లు విదేశీ వస్త్రాలనే విరివిగా వాడుతూ.. అదే తమ ప్రత్యేకతని చెప్పుకునేవారు. ఇప్పుడు వారి మార్కెటింగ్‌ మంత్రం హ్యాండ్‌లూమ్‌గా మారింది. వీటికి ప్రాచుర్యం కల్పించడంలో సెలబ్రిటీల పాత్రా తక్కువేం కాదు. సమయం చిక్కితే చాలు... వియ్‌ లవ్‌ హ్యాండ్‌లూమ్స్‌, వోకల్‌ ఫర్‌ లోకల్‌ అంటూ వారికి చేనేతపై ఉన్న మక్కువను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు.

వోకల్ ఫర్ లోకల్‌ తాము

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ చాలా మందిది ఇదే బాట. విద్యాబాలన్‌కి హ్యాండ్‌లూమ్‌ శారీలు అంటే ఎంత ఇష్టమో సందర్భం దొరికిన ప్రతిసారీ చెబుతూనే ఉంటుంది. ఆ మధ్య ఓ సేవాసంస్థ నిధుల సేకరణ కోసం వేలం వేస్తోంటే తనకెంతో ఇష్టమైన ప్యూర్‌ టస్సర్‌ చీరనిచ్చి వార్తల్లో నిలిచింది. ఇటీవల కేంద్ర క్యాబినెట్‌ విస్తరణ రోజునా మహిళా మంత్రులంతా... వారి ప్రాంతాల చేనేత చీరల్నే కట్టుకొచ్చారు.

తనదైన రీతిలో సమంత ప్రచారం

ఇక సమంత అక్కినేని(Samantha akkineni) గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. రాణా దగ్గుబాటి పెళ్లి వేడుకల్లో లేత ఆకుపచ్చరంగు పొందూరు నేత చీరను కట్టుకుని అదరహో అనిపించింది. అదే కాదు... నేత రకాల్ని ఎంత స్టైలిష్‌గా కట్టుకోవచ్చో చూపించేందుకా అన్నట్టు ధోతీచీర, జంప్‌సూట్‌ వంటివి ధరించి మెప్పించింది. రకుల్‌, రాశీఖన్నా, పూజాహెగ్దేలా తారలంతా సంప్రదాయ చేనేత రకాలపై మనసు పారేసుకున్న వారే. వాటినే వెస్ట్రన్‌, ఫ్యూజన్‌ స్టైల్లో ధరించి వారెవ్వా ఎంతందమో అనిపిస్తున్నారు.

వారెవ్వా.. ఎంత అందమో..

మీరూ ట్రెండ్‌ సెట్‌ చేయొచ్చు.

  • ప్లెయిన్‌ లినెన్‌ చీరకు...3/4 బెల్‌ స్లీవ్స్‌, వీనెక్‌ బ్లవుజు ప్రయత్నించండి. కాలర్‌ నెక్‌ కూడా బాగుంటుంది. కలర్‌ఫుల్‌ పటోలా చీరకు బెల్ట్‌ భలే నప్పుతుంది.
  • పోచంపల్లి డబుల్‌ ఇకత్‌ డిజైన్‌లో పెప్లమ్‌ టాప్‌ని ఎంచుకుని జతగా ప్లెయిన్‌ పలాజో వేసుకుంటే ట్రెండీగా కనిపించొచ్చు.
  • లేత రంగు క్రాప్‌టాప్‌-పలాజో ప్యాంట్‌కు లాంగ్‌కోట్‌ కొత్త లుక్‌ని తెచ్చిపెడుతుంది.
  • నారాయణ్‌పేట్‌ నేత చీరలతో లాంగ్‌గౌన్‌లు కుట్టించుకుని, వాటికి బెల్‌ బాటమ్‌ స్లీవ్స్‌ పెట్టించుకుంటే బాగుంటుంది.
  • ఖాదీ వస్త్రంపై కాంతావర్క్‌, బ్లాక్‌ ప్రింట్‌ చేయించుకుని జంప్‌సూట్‌ కుట్టించుకోవచ్చు. కుర్తీలూ కొత్తగానే ఉంటాయి. అయితే ‘ఏ లైన్‌’ రకాలు మరింత స్టైలిష్‌గా కనిపిస్తాయి.

ఇదీ చదవండి: CM KCR: చేనేత కార్మికులు, పద్మశాలీలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.