ETV Bharat / lifestyle

కెరటాలకు సవాల్‌ విసిరింది!

సముద్రకెరటాలకు ఎదురీదడం నీ వల్ల కాదన్నారు... నీ వయసును మర్చిపోతున్నావంటూ నిరుత్సాహపరిచారు... అయినా ఆమె తనను తాను నమ్ముకుంది. ఆత్మవిశ్వాసంతో సముద్రంలోకి దూకింది... నలభైఏడేళ్ల వయసులో పాక్‌ జలసంధిని 13గంటల 43 నిమిషాల్లో ఈది.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డును సృష్టించింది. ఆమే తెలుగింటి ఆడపడుచు గోలి శ్యామల. తన అనుభవాలను పంచుకుంది.

author img

By

Published : Mar 22, 2021, 1:08 PM IST

story behinds swimmer goli shyamala
కెరటాలకు సవాల్‌ విసిరింది!

నా మొదటి కెరీర్‌ యానిమేషన్‌. పెళ్లయ్యాక ఈ రంగంలోకి వచ్చా. అందులో ఆర్థికంగా నష్టపోయి తీవ్ర ఒత్తిడికి గురయ్యా. అదే నన్ను ఈతకొలనులోకి దిగేలా చేసింది. స్విమ్మింగ్‌ చేస్తే కుంగుబాటు నుంచి బయటపడొచ్చన్నారు వైద్యులు. కానీ చిన్నప్పటి నుంచి నాకు నీళ్లంటే భయం. దాన్ని దాటి ఈత నేర్చుకోవడానికి వెళ్లా. మొదట్లో కొంచెం తడబడినా నెమ్మదిగా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టా. నెలలోపు మూడు స్ట్రోక్స్‌ను నేర్చుకోగలిగా. ఇందులో మంచి ప్రావీణ్యం సంపాదించాలంటే ఒక లక్ష్యం ఉంటేనే వీలవుతుందని పోటీలకూ హాజరయ్యేదాన్ని. అప్పట్నుంచి ఏటా పోటీల్లో పాల్గొనేదాన్ని. అలా ఇప్పటివరకూ రాష్ట్ర స్థాయిలో నాలుగు బంగారు పతకాలూ అందుకున్నా.

story behinds swimmer goli shyamala
కెరటాలకు సవాల్‌ విసిరింది!

నీ వల్లకాదు అన్నారు...

ఓ సారి పత్రికలో ఇంగ్లిష్‌ ఛానెల్‌ను ఈదిన వారి గురించిన వార్త చూశా. దాన్ని చదివినప్పుడు నేనూ అలాంటి పెద్ద లక్ష్యం ఏదైనా సాధించాలనిపించింది. అయితే అందరిలా ఇంగ్లిష్‌ ఛానెల్‌ను కాకుండా మన దేశంలో ఉండేదాన్ని ఎంచుకోవాలనుకున్నా. అదే పాక్‌ జలసంధి. తమిళనాడులోని రామేశ్వరం-శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలను కలుపుతుందది. మొత్తం 30 కి.మీ దూరం ఉంటుంది. గతంలో దీన్ని 14 మంది దాటగా, వారిలో ఒకే ఒక మహిళ ఉన్నారని తెలిశాక నా లక్ష్యమిదే అనుకున్నా. స్నేహితులతో చెబితే ‘నీ వయసు 40 దాటింది. ఇలాంటి సాహసాలు 25 ఏళ్లలోపు వారు మాత్రమే చేయగలరు’ అంటూ నిరుత్సాహపరిచారు. కానీ నేను దీన్నో సవాల్‌గా తీసుకున్నా.

కెరటాలకు సవాల్‌ విసిరింది!
గోలి శ్యామల

కరోనా వల్ల వద్దన్నారు...

పాక్‌ జలసంధిని ఈదేటప్పుడు కో-స్విమ్మర్స్‌ ఉండాలి. అలా ఎవరైనా ఆసక్తి చూపిస్తారేమో అని తెలిసినవారికి చెప్పా. మహారాష్ట్ర నుంచి ఆరుగురు వస్తామన్నారు. సాధన మొదలుపెట్టా. కావాల్సిన అనుమతులను పొందా. అకస్మాత్తుగా ఓ రోజు నాతోపాటు వస్తామన్న వారు రావడంలేదన్నారు. అంతేకాదు, అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, నన్ను కూడా ఈ సాహసానికి పూనుకోవద్దని చెప్పి మరీ వెళ్లారు. అయినా నేను నా నిర్ణయం మార్చుకోలేదు. దాంతో రామేశ్వరంలోని ముగ్గురు జాలర్లను ఓ గంటసేపైనా నాతోపాటు ఈదేందుకు అనుమతి ఇవ్వమని అక్కడి బోట్‌క్లబ్‌ కోరాను. వారు ఒప్పుకోవడంతో నా లక్ష్యాన్ని చేరుకునేందుకు గతేడాది మార్చి 12న రామేశ్వరం చేరుకున్నా. కానీ అక్కడికెళ్లాక కరోనా కారణంతో రద్దు చేసుకోమన్నారు. దాంతో నిరాశగా హైదరాబాద్‌కు చేరుకున్నా.

గ్రీజ్‌ రాసుకుని ఈతకొట్టా...

కరోనా కారణంగా ఆగిన నా సాహసాన్ని ఈ ఏడాదైనా పూర్తి చేయాలనుకున్నా. గతేడాది నవంబరులో తిరిగి సాధన ప్రారంభించా. దాదాపు ఎనిమిది నెలల తర్వాత స్విమ్మింగ్‌కు దిగా. అప్పుడే నా సామర్థ్యం పూర్తిగా తగ్గిందని అర్థమైంది.. దాంతో మళ్లీ సున్నా నుంచే మొదలుపెట్టాల్సి వచ్చింది. కోచ్‌ ఆయుష్‌ యాదవ్‌ సాయంతో రోజుకో గంట చొప్పున పెంచుకుంటూ... తొమ్మిది గంటలపాటు సాధన చేసి తిరిగి పట్టు తెచ్చుకున్నా. నిజానికి పాక్‌ జలసంధిని దాటడం అంత సులువేం కాదు. ఎప్పుడు ఈత ప్రారంభించాలో అక్కడి వాతావరణశాఖ సూచిస్తుంది. దాని ప్రకారం ముందు రోజు రాత్రే సముద్రం మధ్యకి వెళ్లాలి. దానికనుగుణంగా ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున 4.15గంటలకు ఈత మొదలుపెట్టా. చుట్టూ చిమ్మచీకట్లో నిరంతరాయంగా ధనుష్కోటి ఒడ్డువైపు సాగిపోయా. ఉదయం 11 గంటలకే శ్రీలంక జలాల నుంచి భారత జలాల్లోకి అడుగుపెట్టా. అక్కడి నుంచే అసలైన సవాలు ఎదురైంది. ఈదుతుంటే అలలు వెనక్కి లాగేసేవి. బలంగా వాటికి ఎదురీదుతూ ముందుకెళ్లాల్సివచ్చింది. ఉప్పునీటి కారణంగా శరీరమంతా పొడిబారిపోయింది. నోరంతా కొట్టుకుపోయింది. అప్పటికీ ఒంటికి గ్రీజ్‌ రాసుకునే బయలుదేరా. అలాగే నేను ఈదిన ప్రాంతంలో షార్క్‌లుంటాయని సమాచారం. దాంతో షార్క్‌ షీల్డ్‌ అనే ఎక్విప్‌మెంట్‌ను బోటుకు పైన తగిలించాం. ఆ వైబ్రేషన్‌కు అవి మనవద్దకు రావని చెప్పారు. చివరకు సాయంత్రం 5.15కు లక్ష్యాన్ని చేరుకున్నా. నన్ను నిరుత్సాపరిచిన వారందరికీ నేనేంటో నిరూపించా. మాది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డా.

ఇదీ చదవండి: ఛార్జర్​ లేదని యాపిల్​కు రూ.15 కోట్లు ఫైన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.