ETV Bharat / lifestyle

ఆమె మీట నొక్కితే...తూటాల వర్షమే...! - వసుంధర

సుఖోయ్‌ యుద్ధ విమానాల పేరుచెబితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి..అలాంటి ప్రతిష్ఠాత్మక యుద్ధవిమానాలకి.. వెపన్‌సిస్టమ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపడుతోంది తేజస్విని. ఇదేమంత తేలికైన బాధ్యత కాదు. ఇంతవరకూ అమెరికా, బ్రిటన్‌వంటి దేశాలు మాత్రమే మహిళలని ఈ స్థాయిలో ఆఫీసర్‌గా నియమించాయి. ఆ తర్వాత మనదేశం నుంచి ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్న మొదటి మహిళ తేజస్వినీ రంగారావు...

special story on Weaponsystem Officer Tejaswini Rangarao
ఆమె మీట నొక్కితే...తూటాల వర్షమే...!
author img

By

Published : Aug 12, 2020, 9:54 AM IST

విజో... ఈ పదాన్ని ఇంతవరకు పెద్దగా వినిఉండరు. తేజస్వినీరంగారావు మనదేశం నుంచి మొదటి మహిళా విజోగా మారిన తర్వాత మాత్రం అందరికీ సుపరిచితం అవుతోంది. ఇంతకీ విజో అంటే ఏంటనేగా మీ సందేహం. సుఖోయ్‌ వంటి యుద్ధవిమానాలు చేసే యుద్ధవిన్యాసాలని నిర్వహించేందుకు పైలట్లు కాకుండా ప్రత్యేకంగా వెపన్‌ సిస్టమ్‌ అధికారులు ఉంటారు. వాళ్లనే విజో అంటారు.

అత్యంత మనోధైర్యంతో... ఆకాశం నుంచే యుద్ధతంత్రాలు రచించడం వీళ్లపని. ప్రతిష్ఠాత్మక సుఖోయ్‌-30ఫ్లీట్‌ విమానాలకు విజోగా బాధ్యతలు అందుకుంది తేజస్విని. ఆమె స్వస్థలం చెన్నై. తండ్రి రంగారావు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చీఫ్‌ మేనేజరుగా విధులు నిర్వర్తించేవారు. తల్లి రాధిక గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో తేజస్విని చిన్నమ్మాయి. పాఠశాల చదువంతా చెన్నైలో పూర్తి చేసుకున్న తేజస్వినికి చిన్నప్పట్నుంచీ భారతరక్షణ విభాగంలో చేరి దేశానికి సేవలందించాలనే కోరిక ఉండేది. ప్రోత్సాహం అందిస్తే అమ్మాయిలు ఏమైనా సాధిస్తారని నమ్మిన తేజస్విని తల్లిదండ్రులు పుట్టిపెరిగిన చెన్నైని వదలడానికి కూడా సిద్ధమయ్యారు. తమ కుమార్తె అనుకున్నది సాధించగలదనే నమ్మకం ఈ దంపతులకు ఉంది. అందుకే పిల్లల చదువుల కోసం బెంగళూరుకు వచ్చారు.

తేజస్విని అక్కడే బీఎస్సీ బయోటెక్నాలజీ, జెనిటిక్స్‌, కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తిచేసింది. కానీ అంతకుముందు ఎన్‌సీసీలో చేరిన అనుభవం ఆమెను నిలబడనీయలేదు. మంచి జీతం అందించే సౌకర్యవంతమైన ఉద్యోగం కన్నా... అనునిత్యం సవాళ్లకు ఎదురొడ్డి పోరాడే యోధురాలిగానే ఉండాలనుకుంది. పనిచేస్తే భారతరక్షణ రంగంలోనే పనిచేయాలనే ఆమె కోరిక అంత బలంగా మారడానికి కారణం ఎన్‌సీసీ అందించిన అనుభవమే. అలా తన లక్ష్యాన్ని సాధించడం కోసం తేజస్విని నావిగేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకుంది. ప్రవేశపరీక్ష రాసి అర్హత సాధించింది. ఏడాదిపాటు ఉండే ఈ కోర్సుని విజయవంతంగా పూర్తి చేసింది.

నేవిగేషన్‌ స్కూల్‌ అందించే ప్రతిష్ఠాత్మకమైన ప్రెసిడెంట్‌ ప్లాక్‌ మెడల్‌ను దక్కించుకుంది. నిజానికి నావిగేషన్‌ స్కూల్‌ చరిత్రలో అంతవరకు ప్రెసిడెంట్‌ మెడల్‌ను దక్కించుకున్న అమ్మాయి ఒక్కరూ లేరు. అలా తేజస్విని నావిగేషన్‌ స్కూల్‌ చరిత్రను తిరగరాసి రికార్డు సృష్టించింది. ‘ఇక్కడ అందించే శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఎన్నో వైఫల్యాలు ఎదురవుతుంటాయి. అలాగని అక్కడితో ఆగిపోకూడదు. మనోధైర్యంతో ముందడుగు వేస్తూనే ఉండాలి. శిక్షణ పూర్తయిన తర్వాత నేను పడిన సంతోషం అంతా ఇంతాకాదు. అమ్మానాన్నలు నా మీద నమ్మకం ఉంచి ఎన్నో త్యాగాలు చేశారు. ఎప్పుడైనా నిబ్బరం కోల్పోతే వైఫల్యాలను ఎలా విజయాలుగా మార్చుకోవాలో వాళ్లే నాకు నేర్పారు. ముఖ్యంగా నా కలను మా అమ్మ అర్థం చేసుకుంది. స్వేచ్ఛగా ఆలోచించడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం నాకు అందించింది. ఈ రోజు వైమానిక దళానికి వెన్నెముకగా చెప్పే సుఖోయ్‌ విమానాలకి వెపన్‌సిస్టమ్‌ ఆఫీసర్‌గా మారానంటే కారణం అమ్మానాన్నలే. అమెరికా, బ్రిటన్‌ దేశాలు మాత్రమే ఇంతవరకు ఈ హోదాని అమ్మాయిలకు ఇచ్చాయి. నాకూ అలాంటి గౌరవం దక్కిందంటే దానికి నా కుటుంబ ప్రోత్సాహమే కారణం. ప్రతి ఆడపిల్ల వెనుక కుటుంబం ఇటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తే చాలు. అందరూ విజయాలు సాధించి చూపిస్తారు’ అనే తేజస్వినిలో చక్కని సృజనాత్మకతా ఉంది. ఇంత గంభీరంగా ఉండే ఈ అమ్మాయిలో కళాకారిణి కూడా ఉంది. తాను వేసిన బొమ్మలు... ఆ బొమ్మల వెనుక కథలనీ తన బ్లాగులో చక్కగా వర్ణించింది.

ఇదీ చదవండి: 'కోజికోడ్​ విమానాశ్రయ రన్​వే సురక్షితమైనదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.