ETV Bharat / lifestyle

Celebrities about burst the stress : ఒత్తిడిని ఓడించి.. చిరునవ్వులు చిందిస్తారు.. - తెలంగాణ వార్తలు

Celebrities about burst the stress : వర్కింగ్ విమెన్​కు ఎన్నో సవాళ్లు ఉంటాయి. మరోవైపు కుటుంబసమస్యలు. వీటితోపాటు పని ఒత్తిడి సర్వసాధారణం. ఈ పరిస్థితుల్లో ఎన్నో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని కాస్త చిత్తుచేస్తే... అన్ని రకాలుగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలమని చెబుతున్నారు కొందరు మహిళామణులు. అందుకోసం కొన్ని నియమాలు పాటిస్తే సరి అంటున్నారు. అవేంటో వారి మాటల్లోనే...

Celebrities about burst the stress, women's day stories
ఒత్తిడిని ఓడించి.. చిరునవ్వులు చిందిస్తారు..
author img

By

Published : Mar 6, 2022, 12:39 PM IST

Celebrities about burst the stress : ఏ వృత్తిలో ఉన్నా మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. ఆ క్రమంలో ఒత్తిడికి గురి కావడం సాధారణం. ఆమె ఇల్లాలు కూడా అయితే ఆ తీవ్రత మరీ ఎక్కువ. ఈ మానసిక సమస్య కొన్నిసార్లు మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఒత్తిడిని చిత్తుచేయడం ఆధునిక మహిళకు చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం కోసం తాము పాటించే చిట్కాలూ, నియమాల గురించి పలువురు ప్రముఖులు ఏం చెబుతున్నారంటే...

.

నృత్యంతో..

దాదాపు నటీనటులందరూ జిమ్‌కు వెళుతుంటారు. అయితే నేను దీనికి భిన్నం. నేనెప్పుడూ జిమ్‌లోకి అడుగు పెట్టలేదు. ఇల్లు లేదా షూటింగ్‌.. ఎక్కడైనా నృత్యం నా దినచర్యలో భాగం. ఇది నాకు థెరపీగా పనిచేసి ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే దూరం చేస్తుంది. మరొక విషయం చెప్పనా... చిత్రీకరణల మధ్యలో వ్యవధి దొరికినా డ్యాన్స్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తా. మానసికంగానే కాదు, శారీరకంగానూ నేను ఫిట్‌గా ఉండటానికి ఈ అభిరుచి ఉపయోగపడుతుంది.

- సాయి పల్లవి

.

వర్కవుట్లు, ఐస్‌క్రీంతో..

మయంతో పనిలేకుండా పరుగులు పెడుతుంటాం. ఎక్కడున్నా సినిమాలో చేస్తున్న పాత్ర గురించి ఆలోచించడం, లుక్‌.. వంటివెన్నో మనసులో మెదులుతూనే ఉంటాయి. ఇవన్నీ ఒత్తిడికి గురి చేసేవే. దీన్నుంచి వీలైనంత త్వరగా బయట పడటానికి జిమ్‌లో ఎక్కువసేపు గడుపుతా. బాగా ఒత్తిడి అనిపిస్తే.. రోజూ చేసేదానికన్నా ఎక్కువ వర్కవుట్లు చేస్తా. ఇంట్లో ఉంటే టీవీ చూస్తూ ఎక్కువగా ఐస్‌క్రీం తింటూ గడిపేస్తా. అంతే.. సమస్యలన్నీ మటుమాయం.

- రష్మికా మంధాన

.

సంగీతమే ఔషధం

కొన్ని సందర్భాల్లో కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళన మనల్ని ఆవరిస్తాయి. వాటి నుంచి వెంటనే దూరంగా జరగలేం. మరీ బాధగా అనిపిస్తే ఏడ్చేస్తా. మనసు తేలిక పడుతుంది. రోజూ కాసేపు మనసుకు నచ్చిన పాటలు, మ్యూజిక్‌ వింటాను. ఇది థెరపీగా పనిచేసి ఒత్తిడికి దూరంగా ఉంచుతుంది. ఆ క్షణానికి బయట పడాలనిపిస్తే దాని గురించి ఆలోచించకుండా మంచి విషయాల్ని గుర్తు తెచ్చుకుంటా. ఇదీ పనిచేసే మార్గమే.

- పూజా హెగ్దే

.

కుటుంబంతో పర్యటనలు..

దువు, ఉద్యోగం, కుటుంబం, పిల్లలు వీటి మధ్య క్షణం కూడా మనకి తీరిక ఉండదు. 1998లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ క్యాడర్‌గా చేరినప్పుడు పదేళ్లపాటు ఉన్నత చదువులకు అవకాశం దక్కింది. ఇంటిని, పిల్లలను చూసుకుంటూ, మరోవైపు విధులు నిర్వహిస్తూ ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా పూర్తిచేయగలిగా. చదువుకోవడంతోపాటు ఉద్యోగం, పిల్లల చదువులు, ఇంటి శుభ్రత, కుటుంబాన్ని చూసుకోవడం వంటివన్నీ సమన్వయం చేసేదాన్ని. వీటిలోనూ రిలాక్స్‌ పొందేదాన్ని. ఇంట్లో పరిశుభ్రత పాటిస్తేనే సంతోషం ఉంటుందని నమ్ముతా. అలాగే 2008 - 2021 మధ్య జిల్లా జడ్జిగా పనిచేశా. అప్పుడు వేరే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. కుటుంబానికి దూరంగా ఉండేదాన్ని. వారాంతంలో ఇంటికి వెళ్లడం, వారికిష్టమైనవి వండిపెట్టడం వంటివన్నీ సంతోషాన్నిచ్చేవి. గతేడాది అక్టోబరులో హైకోర్టు జడ్జిగా బాధ్యతలు తీసుకున్నా. ఇప్పుడిక క్షణం కూడా తీరిక దొరకడం లేదు. అయితే ఇప్పటికే పిల్లలు ఇంటి పనులన్నీ నేర్చుకున్నారు. వాళ్లే చదువుకునే స్థాయికెదిగారు. తల్లిగా మనకు తెలియకుండానే ఇంటిల్లపాదికీ చాలా విషయాలు నేర్పుతాం. పుస్తకాలు చదవడమంటే ఇష్టం. అయితే పుస్తకాన్ని తెరడానికి కూడా తీరిక లేదు. దాంతో ఒత్తిడిని దూరం చేయాలంటే అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం, శుభకార్యాలకు హాజరై బంధువులు, స్నేహితులను కలవడం చేస్తుంటా.

- జస్టిస్‌ రాధారాణి, తెలంగాణ హైకోర్టు

.

పిల్లల కథలు వింటా...

కుటుంబం, విధుల సమన్వయం కొన్ని సందర్భాల్లో కొంచెం కష్టమే. రోజూ ఆఫీస్‌ ఒత్తిడి ఒకేలా ఉండదు. అలా దొరికిన సమయాన్ని కుటుంబంతో గడపడానికి వెచ్చిస్తా. మావారితో కలిసి సినిమాలు చూస్తా. పాటలు వింటా. పిల్లలను కథలు చెప్పమని వింటుంటా. పిల్లల్లో చాలా సృజనాత్మకత ఉంటుంది. దాన్ని బయటికి తెస్తే చాలు. మనకూ అది రిలీఫ్‌ను ఇస్తుంది. ఆఫీస్‌లో క్లిష్టమైన సందర్భాలెదురైనప్పుడు ఒత్తిడికి గురవకుండా, పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తా. అలా చేస్తే సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం. ఉదయం మావారితో కలిసి నడకకు వెళ్లినప్పుడు వాటి గురించి చర్చిస్తా. ఇవన్నీ ఒత్తిడిని నాదగ్గరకు రానివ్వవు. గతంలో టీవీలో వార్తలు మాత్రమే చూసేదాన్ని. ఈమధ్య సమయం ఉంటే డిస్కవరీ ఛానెల్‌ చూస్తున్నా. ప్రకృతి, జంతువులను పరిశీలిస్తుంటే హాయిగా అనిపిస్తుంది. అంతేకాదు, ఇటీవల ఓటీటీలో వెబ్‌సిరీస్‌లనూ చూస్తున్నా. ఇక పిల్లల చదువులు, పేరెంట్‌ మీటింగ్స్‌ వంటివన్నీ మావారు, నేను ఎవరికి సమయం ఉంటే వాళ్లం పంచుకుంటాం. సమయపాలనను పాటిస్తా. వ్యాయామం, ధ్యానం వంటివీ చేస్తుంటా. ఇవన్నీ నన్ను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఏదైనా సమస్య వచ్చినా తేలికగా పరిష్కరించి సమన్వయం చేయగలుగుతున్నా. నా సంతోషమంతా విధులు, కుటుంబంలోనే ఉంది.

-స్వాతి లక్రా, అడిషనల్‌ డీజీపీ, తెలంగాణ మహిళా భద్రతా విభాగం

ఇదీ చదవండి: Ramoji Film City Women's day: రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళా మహోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.