ETV Bharat / lifestyle

ఆట కోసం అమ్మ తన నగలు తాకట్టు పెట్టింది! - ఫెన్సింగ్‌ క్రీడాకారిణి సీఏ భవానీ దేవి

ఒలింపిక్స్‌ నాలుగేళ్లకోసారి వచ్చే ఈ అంతర్జాతీయ ఆటల పండుగకు ఉన్న ప్రాధాన్యతేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన క్రీడాకారులంతా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో పాల్గొనాలని, కనీసం ఒక పతకమైనా సాధించాలని కలలు కంటుంటారు. అందుకోసం రాత్రింబవళ్లు పట్టు వదలకుండా ప్రయత్నిస్తుంటారు. అలా ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించాలన్న తన స్వప్నాన్ని సాకారం చేసుకునే క్రమంలో మొదటి అడుగు విజయవంతంగా పూర్తి చేసింది సీఏ భవానీ దేవి. తన నిర్విరామ కృషికి ప్రతిఫలంగా కొద్ది రోజుల క్రితమే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిందీ 27 ఏళ్ల ఫెన్సర్‌. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఫెన్సింగ్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. తన ప్రతిభతో ప్రముఖుల ప్రశంసలు, మన్ననలు అందుకుంటోన్న ఈ యంగ్‌ సెన్సేషన్‌ తాజాగా తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది.

ca bhavani devi, CA Bhavani Devi profile
ఆట కోసం అమ్మ తన నగలు తాకట్టు పెట్టింది!
author img

By

Published : Apr 4, 2021, 7:32 PM IST

చిన్నప్పటి నుంచి ఆసక్తి

గతేడాది జులైలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది జులైలో ఈ విశ్వక్రీడలు నిర్వహించడానికి జపాన్‌ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జులై 23 నుంచి ఆగస్టు 8వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో తనకొచ్చిన సువర్ణావకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే తలంపులో ఉంది భవాని. అందుకోసం అహర్నిశలూ కష్టపడుతోంది. ఈమె పూర్తి పేరు చదలవాడ ఆనంద సుందర రామన్‌ భవానీ దేవి. చెన్నైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఫెన్సింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. పదో తరగతి పూర్తయ్యాక సాయ్‌ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా)లో చేరి ఈ క్రీడలో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంది.

14 ఏళ్లకే అంతర్జాతీయ టోర్నీ!

14 ఏళ్ల వయసులోనే తొలి అంతర్జాతీయ టోర్నీ ఆడిన భవాని... 2009లో మలేషియాలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం సాధించడంతో వెలుగులోకి వచ్చింది. ఇక అక్కడి నుంచి మొదలైన ఆమె విజయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ఏషియన్‌ గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లతో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కలేనన్ని పతకాలు సాధించింది. ఇక 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించడం ద్వారా ఫెన్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అదే ఏడాది తండ్రి మరణించడం ఆమెను బాగా కుంగదీసింది.

ఎనిమిదేళ్ల ప్రయత్నం!

ఫెన్సింగ్‌లో ఎనిమిదిసార్లు నేషనల్‌ ఛాంపియన్‌ అయిన భవానికి ఒలింపిక్స్‌లో ఆడాలనేది పెద్ద కల. ఇందుకోసం 2012 నుంచి సర్వశక్తులు ఒడ్డుతోంది. కానీ 2012 లండన్‌ ఒలింపిక్స్‌, 2016 రియో క్రీడల్లోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. ఇక కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఫెన్సింగ్‌ అర్హత పోటీలన్నీ రద్దు కావడంతో ఈ యంగ్‌ ఫెన్సర్‌ ప్రయత్నాలకు మరింత గట్టి దెబ్బ తగిలినట్లయింది. కానీ ఆశావహ దృక్పథంతో ప్రాక్టీస్‌ను కొనసాగించింది. తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు సాగింది. అలా ఈ ఏడాది మార్చిలో బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ పోటీల్లో ప్రతిభ చాటి ఒలింపిక్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఒలింపిక్‌ క్రీడల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది భవాని. అదే సమయంలో ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల కోసం తానెంతలా కష్టపడ్డానో అందరితో పంచుకుంది. ‘ఒలింపిక్‌ బెర్తు కోసం ఏళ్ల తరబడి ప్రయత్నించాను. కొన్నేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉండి ఇటలీలో సాధన చేశాను. ఇక హంగేరిలో కొవిడ్‌ నిబంధనలు కఠినంగా ఉండడంతో రోడ్డు మార్గంలో బుడాపెస్ట్‌కు వెళ్లి ప్రపంచకప్‌ పోటీల్లో పాల్గొన్నాను. నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. కచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’.

అమ్మ నగలు తాకట్టు!

‘నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఆసక్తి. సానియా మీర్జా లాంటి వారిని చూసి నేను కూడా ఏదో ఒక క్రీడలో బాగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను. నా చదువంతా చెన్నైలోనే సాగింది. అక్కడ ఆరో తరగతి చదువుతున్నప్పుడు మా పాఠశాలలో కొత్తగా కొన్ని క్రీడలను ప్రవేశపెట్టారు. నా తోటి విద్యార్థులందరూ వారికిష్టమైన ఆటలను ఎంచుకున్నారు. నా వంతు వచ్చే సరికి ఫెన్సింగ్‌ క్రీడలో మాత్రమే ఖాళీ ఉండడంతో దానినే ఎంచుకున్నాను. నా ఆసక్తిని గమనించిన అమ్మానాన్నలు కూడా నన్ను ప్రోత్సహించారు. ఈ క్రీడలో నాకు పూర్తి శిక్షణ ఇప్పించారు. కానీ ఈ ఆటను నేర్చుకునే క్రమంలో నాకు చాలా అడ్డంకులు, అవరోధాలు ఎదురయ్యాయి. ఎందుకంటే మా తల్లిదండ్రులకు మొత్తం ఐదుగురు సంతానం. పెద్దగా ఆదాయ వనరులు కూడా లేవు. ఇక నేను ఈ క్రీడలోకి మొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు ‘మీ నాన్న వార్షిక ఆదాయమెంత’? అని అడిగారు. నాలాంటి పేద విద్యార్థులందరికీ ఈ ప్రశ్నే ఎదురైంది. ఎందుకంటే ఫెన్సింగ్‌ అంటే ఓ ఖరీదైన క్రీడ. ఇందులో ఉపయోగించే కత్తులు, ఇతర పరికరాలు కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. మాకు అంత స్థోమత లేకపోవడంతో కెరీర్‌ ప్రారంభంలో నేను వెదురు కర్రలతో సాధన చేసేదాన్ని. ఇక టోర్నీల్లో పాల్గొనేందుకు సరైన ఆర్థిక వనరులు లేకపోవడం, స్పాన్సర్లు ముందుకు రాకపోవడం, ఎప్పటికప్పుడు కొత్త క్రీడా పరికరాలు కొనాల్సి రావడం మాకు తలకు మించిన భారమైంది. ఈ క్రమంలో ఒకసారి నాకు డబ్బులు సమకూర్చడానికి మా అమ్మ తన ఆభరణాలను కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇక నేను విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా మా ఇరుగు పొరుగున ఉండే కొందరు ‘మీ కూతురిని ఎందుకు ఇంత చిన్న వయసులో అంత దూరం పంపిస్తున్నారు?’ అని అమ్మానాన్నలను అడిగేవారు.’

లాక్‌డౌన్‌ వినియోగించుకున్నా!

‘ఒలింపిక్స్‌లో ఆడాలని గత ఎనిమిదేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. కానీ కుదరలేదు. దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకున్నాను. కానీ కరోనా నా ఆశలను వమ్ము చేసింది. దీని ప్రభావంతో గతేడాది జరగాల్సిన ఫెన్సింగ్‌ అర్హత పోటీలన్నీ రద్దయ్యాయి. అయినప్పటికీ నేను ఆశావహ దృక్పథంతోనే ప్రాక్టీస్‌ను కొనసాగించాను. లాక్‌డౌన్‌ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని నా ఫిట్‌నెస్ స్థాయుల్ని మెరుగుపరచుకునేందుకు వినియోగించుకున్నాను. అదేవిధంగా ఆటకు సంబంధించి కొన్ని సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకున్నాను. దీనికి తగ్గ ఫలితం ఒలింపిక్‌ బెర్తు రూపంలో నాకు దొరికింది.’

సానుకూల దృక్పథంతోనే!

‘ఫెన్సింగ్‌కు భారతదేశంలో పెద్దగా ప్రాచుర్యం లేదు. అందుకే చాలామంది దీనిని కెరీర్‌గా తీసుకోవడం లేదు. అయితే అదృష్టవశాత్తూ నేను ఈ క్రీడను కెరీర్‌గా ఎంచుకున్నాను. ఎంతో శ్రమపడి ఇక్కడ వరకు వచ్చాను. ఇక ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులపై ఎన్నో అంచనాలుంటాయి. దీనివల్ల ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఇక నా ఆటకోసం కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. వాళ్ల ప్రేమాభిమానాలు నాపై ఎలాంటి ఒత్తిడిని తీసుకురావు. ఏదేమైనా సానుకూల దృక్పథంతోనే ముందుకెళతాను. నా కలను నెరవేర్చుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెప్పుకొచ్చిందీ యంగ్‌ ఫెన్సర్‌. ఒలింపిక్స్‌లో పతకం కోసం అహర్నిశలూ శ్రమిస్తోన్న భవానీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమూ ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదాం!

ఇదీ చూడండి : రజనీ సినిమా రీమేక్​.. లీడ్​రోల్​ శ్రద్ధా కపూర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.