ETV Bharat / lifestyle

క్లిక్‌ కొట్టేయండి.. భావాన్ని పట్టేయండి! - telangana news

డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా ఉంటేనే ఫొటోలు అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు చేతిలో ఫోన్‌ ఉంటే చాలు ఫొటోగ్రఫీ స్కిల్స్‌ని ప్రదర్శించొచ్చు అనుకునే స్థితికి వచ్చేశాం. మరైతే.. రెండింటితో కళాత్మకంగా ఫొటోలు క్లిక్‌ కొట్టాలంటే ఫ్రొఫెషనల్‌గా మారాల్సిందే. అందుకే ఈ యాప్‌లు. చిట్కాల రూపంలో ట్యుటోరియల్స్, నిపుణుల సూచనలు.. ఇంకా చాలానే ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వినియోగదారులు వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫొటోగ్రఫీపై పట్టుసాధించొచ్చు. మీరూ ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే ఎందుకు ఆలస్యం స్టార్ట్‌ చేసేయండి..

these-are-the-some-applications-and-tutorials-that-help-to-earn-photography-skills
కళాత్మకంగా క్లిక్‌ కొట్టేయండి..
author img

By

Published : Feb 18, 2021, 3:33 PM IST

  • ఓ మంచి ప్రారంభం

ఎలిమెంట్స్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ

దేన్నయినా నేర్చుకుందాం అనుకుంటే బేసిక్స్‌ నుంచి ప్రారంభించడమే సరైన విధానం. ఫొటోగ్రఫీలో కూడా ఇలాగే ప్రాథమిక చిట్కాలతో మొదలుపెట్టేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. ఫోన్‌ని ముందు పెట్టుకుని విభాగాల వారీగా రియల్‌-టైమ్‌లోనే నేర్చుకోవచ్చు. అంటే.. మీకు డీఎస్‌ఎల్‌ కెమెరా ఉంటే ఫోన్‌లో ఛాప్టర్‌లను చూస్తూ సాధన చేయొచ్చు. పాఠం పూర్తయ్యాక చివర్లో క్విజ్‌ ఉంటుంది. మీరెంత సాధన చేశారో తెలుసుకునేందుకు ఓ పరీక్ష లాంటిది అన్నమాట. ఉచిత వెర్షన్‌లో కొన్ని బేసిక్స్‌ని నేర్చుకోవచ్చు. కావాలంటే ప్రీమియం వెర్షన్‌కి అప్‌డేట్‌ అవ్వొచ్చు.

డౌన్‌లోడ్‌ లింక్‌: http:bit.ly/3d5xKJG

  • పాఠ్యాంశాల వారీగా..

ఫొటోగ్రఫీ ట్యుటోరియల్స్‌

ఏదైనా కొత్త అంశాన్ని నేర్చుకుందాం అనుకుంటే ఆన్‌లైన్‌ పాఠాలు ఏమున్నాయా? అని వెతికేస్తాం. ఫొటోగ్రఫీపై అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ ట్యుటోరియల్స్‌ని గుత్తగా ఒకేచోట అందిస్తోంది ఈ యాప్‌. అంశాల వారీగా కావాల్సిన వాటిని సెలెక్ట్‌ చేసి చదువుకోవచ్చు. సుమారు 2,000లకు పైనే ఫొటోగ్రఫీ ట్యుటోరియల్స్‌ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్‌ని ఎంపిక చేసుకుని చదువుకుంటూ మీ స్కిల్స్‌ని సాన పెట్టొచ్చు.

డౌన్‌లోడ్‌ లింక్‌: http:bit.ly/3pbga9u

  • కోర్సుల అడ్డా..

ఉడేమి

నెట్టింట్లో ఆన్‌లైన్‌ కోర్సులు చాలానే చేస్తుంటాం. ఫొటోగ్రఫీని కూడా ఓ కోర్సులా నిపుణుల పాఠాలు వింటూ నేర్చుకుందాం అనుకుంటే ఇదో చక్కని అడ్డా. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా పలు రకాల కోర్సుల్ని అందిస్తోంది. సెర్చ్‌తో ఫొటోగ్రఫీ కోర్సులు బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. మీకు సరిపోతుంది అనుకున్న క్లాస్‌లను ఎంపిక చేసుకుని వినొచ్చు. అంతేకాదు.. ఆన్‌లైన్‌ పాఠాల్ని డౌన్‌లోడ్‌ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు.

డౌన్‌లోడ్‌ లింక్‌: http:bit.ly/3q9QtY2

  • ‘స్కిల్స్‌’ స్థావరం..

స్కిల్‌షేర్‌

క్రియేటివ్‌ స్కిల్స్‌ని పరిచయం చేస్తోందీ యాప్‌. ప్రధానంగా ఫొటోగ్రఫీకి సంబంధించిన స్కిల్‌ని పెంచుకునేందుకు ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ని వాడుకోవచ్చు. డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాలపైనే కాకుండా.. ‘స్మార్ట్‌ఫోన్‌ ఫొటోగ్రఫీ’ అంశంతో కేవలం ఫోన్‌తోనే ఆకట్టుకునే ఫొటోలు ఎలా తీయొచ్చనేది నేర్చుకోవచ్చు. ఉచితంగానూ చాలా క్లాసులు అందుబాటులో ఉన్నాయి. ‘డిస్కషన్స్‌’ ఫీచర్‌తో కమ్యూనిటీలోని సభ్యులతో ఫొటోగ్రఫీ అంశంపై చర్చించొచ్చు. ప్రీమియం మెంబర్‌గా అప్‌డేట్‌ అయితే.. క్లాస్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ చూడొచ్చు.

డౌన్‌లోడ్‌: http:bit.ly/3rKrpqX

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.