ETV Bharat / lifestyle

క్రెడిట్‌ కార్డు, పాస్‌పోర్టు... అన్నీ శుభలేఖలే...!

author img

By

Published : Jan 3, 2021, 4:31 PM IST

పెళ్లంటే... పందిళ్లు సందళ్లు తప్పెట్లు తలంబ్రాలు... ఇలా ఎన్నో తంతులు. ఆ జాబితాలో తొలిస్థానం మాత్రం శుభలేఖదే. ‘మా అమ్మాయి/అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం... బంధుమిత్రులందరూ తప్పక వచ్చి ఆశీర్వదించండి’ అంటూ ఆనందంగా అందించే ఆహ్వాన పత్రిక. ‘మరి, జీవితంలో ఎంతో ముఖ్యమైన ఆ ఘట్టాన్ని చెప్పే శుభలేఖ సాదాసీదాగా ఉంటే ఎలా... కొంచెం కొత్తగా ఇంకొంచెం భిన్నంగా ఉంటే బాగుంటుంది కదా... అంటోంది’ ఈతరం.

wedding cards
wedding cards

పెళ్లికి శుభలేఖలు వేయించడం మన తాత ముత్తాతల నుంచీ ఉంది. ‘ఫలానా వాళ్ల అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి కల్యాణం చేస్తున్నాం’ అంటూ అమ్మాయీ అబ్బాయీ తల్లిదండ్రుల పేర్లూ వాళ్లది ఏ ఊరు... లాంటి విషయాలను తెలియజేయడంతో పాటు ఏ ముహూర్తానికి ఎక్కడ పెళ్లి చేస్తున్నాం... అన్న సమాచారాన్ని కూడా అందులో వివరంగా చెప్పి శుభలేఖల్ని అచ్చు వేయిస్తుంటారు.

రూపునే మార్చేసి..

మొదట్లో విషయానికి తప్ప కార్డు అందానికి పెద్దగా ప్రాముఖ్యత ఉండేది కాదు. రానురానూ ఆహ్వాన పత్రికను ఆకర్షణీయంగా తయారుచెయడం మొదలుపెట్టారు. ఇప్పటి హైటెక్‌ తరం అక్కడితోనూ ఆగడంలేదు. ఏకంగా శుభలేఖ రూపునే మార్చేసింది. వాటిలో కొన్ని ఎలా ఉంటున్నాయంటే... ‘పెళ్లికి తప్పకుండా రండి...’ అని కార్డుని బంధువుల చేతిలో పెడితే... అది చూసినవాళ్లు... ‘అయ్యో మీరు శుభలేఖ బదులు పొరపాటున క్రెడిట్‌ కార్డు ఇచ్చేశారు’ అంటూ తిరిగివ్వబోయేంత భిన్నంగా కనిపిస్తున్నాయి.

credit card wedding card
క్రెడిట్ కార్డు ఆకారంలో శుభలేఖ

చూస్తే నమ్మరు

క్రెడిట్‌ కార్డు, పాస్‌పోర్టు, విమానం టికెట్‌, న్యూస్‌పేపర్‌, మ్యాగజైన్‌ కవర్‌, ఫోన్, వాట్సాప్‌ స్క్రీనూ... ఇలా ఇక్కడ ఫొటోల్లో కనిపించేవన్నీ శుభలేఖలే. ఆయా రూపాల్లో కార్డుల్ని తయారుచేయించడమే కాదు, వధూవరుల పేర్లూ పెళ్లి ముహూర్తం వివరాలను కూడా కార్డు మోడల్‌కి తగ్గట్లూ ప్రింట్‌ చేయిస్తున్నారు. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు శుభలేఖల్ని తీసుకుంటే బ్యాంకు పేరు దగ్గర ‘న్యూలైఫ్‌ బ్యాంకు’ అనీ క్రెడిట్‌ కార్డు అని ఉండేచోట ‘వెడ్డింగ్‌ కార్డు’... అనీ కార్డు నంబరు స్థానంలో పెళ్లి తేదీ, వెనకవైపున బంధువులకు ఆహ్వానం, వేడుక జరిగే చోటు... లాంటి విషయాలు ఉంటాయి.

కొత్త ట్రెండ్​
wedding card
విభిన్నమైన శుభలైఖలు

వాట్సాప్‌ స్క్రీన్‌ మీద పెళ్లి పత్రికను మెసేజ్‌ల రూపంలోనూ... వార్తాపత్రిక, మ్యాగజైన్‌లాంటి కార్డుల్లో ఆహ్వానాన్ని హెడ్డింగులూ వార్తల్లానూ ప్రింట్‌ చేయిస్తున్నారు. వీటితో పాటు పట్టుబట్టలతో కొంగుముడి వేసిన ఫ్రేముల రూపంలో వచ్చే శుభలేఖలు ఒకరకమైతే, కార్డుని తెరవగానే అగ్నిహోత్రం, వధూవరులు దండలు మార్చుకుంటున్న త్రీడీ దృశ్యాలు కనిపించే పాప్‌అప్‌ ఆహ్వాన పత్రికలు మరోరకం. ప్రతిదాన్లోనూ ప్రత్యేకత కోరుకునే ఈతరం పెళ్లి పత్రికల్లోనూ ఇలా కొత్త ట్రెండ్‌ని సృష్టించేస్తున్నారు.

wedding card
విభిన్నమైన శుభలైఖలు

ఇదీ చదవండి : కొవాగ్జిన్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్.. త్వరలోనే పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.