ETV Bharat / lifestyle

ముందుకు సాగడమే.. కాలగమనం మనకు నేర్పే పాఠం! - when will kali yug ends

మీరీ విషయం చదువుతుండగానే కొన్ని నిమిషాలు దొర్లిపోయాయి... నిమిషాలే కాదు మన గతం, వర్తమానం, భవిష్యత్తు కూడా గడిచిపోతుంది. అంతేనా...ఈ చరాచర జగత్తు అంతా కాలంలో పుట్టి... కాలగర్భంలోనే కలిసిపోతుంది. మరి ఈ అనంత కాల మహిమను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ఆలోచించాలి? మనమెలా జీవించాలి..?అద్వైతాన్ని కాచివడపోచి ప్రపంచానికి సులభమార్గంలో బోధించిన రమణమహర్షి చెప్పిందిదీ..

ramana maharshi, ramana maharshi teachings
రమణ మహర్షి, రమణ మహర్షి బోధన
author img

By

Published : Apr 20, 2021, 8:43 AM IST

అరవింద ఆశ్రమవాసి ఒకరు అరుణాచలం వచ్చారు. ఆయన మహర్షి సన్నిధిలో కూర్చుని ‘భగవాన్‌! కలియుగం ఎప్పుడు అంతమవుతుంది అని అడిగారు. అప్పుడు మహర్షి ‘గత యుగాల గురించి మనకేం తెలీదు. అలాగే భవిష్యత్తునూ తెలుసుకోలేం. వర్తమానం ఉందని మాత్రం తెలుసు. దాన్ని గురించే ఆలోచిద్దాం. నిద్రలో ప్రపంచంగానీ, గతంగానీ, భవిష్యత్తుగానీ లేవు. కానీ మనం ఉన్నాం. అలాగే నిత్యమైందీ, మార్పులేనిదీ ఒకటుంటుంది. మిగిలినవన్నీ మారుతూనే ఉంటాయి’ అని చెప్పారు. అయితే పురాణాలు ప్రతి యుగం ఎంతకాలం ఉంటుందో ఎందుకు చెబుతున్నాయి.. అని ఆ భక్తుడు ప్రశ్నించాడు అప్పుడు మహర్షి సావధానంగా ఇలా చెప్పారు..‘ఒక్కో యుగం అంతకాలం ఉంటుందని చెప్పడంలో ఆంతర్యం, వందేళ్ల మనిషి జీవితం ఎంత స్వల్పమైందో చెప్పడానికే. జగత్తులో తన స్థానమెంటో, స్థాయి ఏంటో తెలుసుకుని మనిషి ప్రవర్తించాలి. అనంతంతో పోల్చుకుంటే మనిషి ఎంత స్వల్పమో తెలుసుకుని నడుచుకోవాలి’. అని వివరించారు.

కాలగమనం మనకో పాఠం నేర్పుతుంది...

ముందుకు సాగడమే.. నీ ధర్మమని!

ఆశ, నిరాశలకు అతీతంగా విద్యుక్త ధర్మాన్ని ఆచరించేవారికి కాలం

సహస్ర హస్తాలతో సహకరిస్తూనే ఉంటుంది.

అది స్థూలరూపంలో కనిపించకున్నా, అదృశ్యంగా గమ్యంవైపు నడిపిస్తుంది.

ఓ యువకుడు ఆశ్రమానికి వచ్చాడు. ‘భగవాన్‌ నాకు కాలం కలిసిరావడం లేదు. ఏం చేసినా పలితం ఉండడం లేదు. చోటు మారితే ఏమైనా ఫలితం ఉంటుందా? అని అడిగాడు. అప్పుడు రమణులు ‘చోటు మారడం వల్ల జీవితంలో ఏమార్పూ ఉండదు. నీ మనస్సు మారాలి. మనోబలం లేనిదే ఆధ్యాత్మికంగానే కాదు ప్రాపంచికంగా కూడా అభ్యున్నతి సాధించలేం. తనపై తనకు నమ్మకం లేనివాళ్లకు కాలం ఏం సహకరిస్తుంది? దృఢమైన సంకల్పంతో ప్రయత్నం చేయడమే నీ కర్తవ్యం అన్నారు.

రమణులు అరుణాచలంలోని విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఆయన బాల్య స్నేహితుడు రంగన్‌ వచ్చాడు. ఓరోజు అర్ధరాత్రి రంగన్‌ నిద్రపట్టక అశాంతితో తన కష్టాల గురించి ఆలోచిస్తూ తిరుగుతున్నాడు. అది గమనించిన మహర్షి ‘రంగన్‌! ఇప్పుడు ఇంత బాధ పడుతున్నావు. సంఘటనలు సముద్రంలో అలల్లా వస్తూపోతూ ఉంటాయి. ఆ ఎరుక లేకపోవడం వల్లనే ఇంత బాధ కలుగుతుంది. కొద్ది రోజులయ్యాక ‘నేనేనా బాధపడింది!’ అని నవ్వుకుంటావు. నిద్రలో నుంచి మేలుకున్నాక కలకు ఎంత విలువనిస్తావో, జ్ఞానవంతుడివయ్యాక జీవితంలో కష్టనష్టాలకు అంత విలువనిస్తావు.’ అన్నారు.

ఓ వ్యాపారి రమణుల దగ్గరకు వచ్చి ఈరోజు నుంచి పనులన్నీ మానేసి ఆశ్రమంలోనే ఉండాలనుకుంటున్నానని అన్నాడు. అప్పుడు చిరునవ్వుతో రమణులిలా అన్నారు. ‘నువ్వులా చేయలేవు. నువ్వు చేయాల్సిన పనిని కాలం వెంటాడి వేటాడి నీతో చేయిస్తుంది... అదే నువ్వు చేయాల్సింది లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ పని దొరకదు. చేయడం, చేయకపోవడం నీ చేతిలో లేదు. నువ్వు చేయాల్సిందేమంటే పని చేయడానికి, చేయకపోవడానికి సిద్ధంగా ఉండడమే’.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.