ETV Bharat / lifestyle

కోడి పందేల జాతర... కార్ల బారులు, కిక్కిరిసిన బరులు! - cock races in Ampapuram, Krishna district

అక్కడ పందేలకు అడ్డులేదు.! సౌకర్యాలకు కొదువలేదు.! వినోదానికి లోటులేదు.! ఇంకేముంది కారులు బారులు తీరాయి. బరులు కిక్కిరిశాయి. పుంజులు ప్రతాపం చూపాయి. కరెన్సీ నోట్లు చేతులు మారాయి. మొత్తంగా కోడిపందేలు జనజాతరను తలపించాయి

cock-fighting-in-ampapuram-krishna-district
ఏపీలోని అంపాపురంలో జోరుగా కోళ్ల పందేలు
author img

By

Published : Jan 15, 2021, 12:08 PM IST

ఏపీలోని అంపాపురంలో జోరుగా కోళ్ల పందేలు

భారీ టెంట్లు...... వరుసకట్టిన వాహనాలు.. గుమికూడిన జనాలు.... వీక్షకుల కోసం సోఫాలు...చూశారుగా ఈ హంగామా....! ఇక్కడేమీ తాయిలాలు పంచడంలేదు. అమ్మవారి జాతరో, పోలేరమ్మ తిరునాళ్లో జరగడంలేదు. మరి.. ఇంత జనం ఏంటి అనేగా మీ సందేహం.! ఇది ఏటా సంక్రాంతికి జరిగే కోడిపందేల జాతర.....! మూడురోజుల పందేల కోసం....ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని అంపాపురం వద్ద ఏర్పాటు చేసిన బరులే ఇవి.

ఇక్కడి పందేలను తిలకించేందుకు... కృష్ణా జిల్లా నుంచేకాదు.. హైదరాబాద్‌ నిుంచీ వీక్షకులు వచ్చి వాలిపోయారు. ఇలా వందల సంఖ్యలో బారులు తీరిన కార్లు, బైకులు వాళ్లవే. ఇంత జనాన్ని చూసి ఆశ్చర్యపోకండి. ఇక్కడున్నఏర్పాట్లు అలాంటివి మరి. ఎండపడకుండా పెద్ద టెంట్లు, దర్జాగా కూర్చుని పందేలు తిలకించేలా సోఫాలు.. దూరంగా ఉన్నవారికీ బాగా కనిపించేలా పెద్ద ఎల్​ఈడీ తెరలు ఇలా సౌకర్యాలకు లోటులేకుండా చేశారు నిర్వాహకులు. అందుకే మహిళలు కూడా ముందువరుసలో కూర్చుని కోడిపందేలను యమఆసక్తిగా తిలకించారు. పండుగ సందడంతా ఇక్కడే ఉదంటూ సంబురపడ్డారు. ఇక్కడ కోడిపందేలతోపాటు ఇతర క్రీడలూ వినోదాన్ని పంచాయని సంతృప్తి వ్యక్తంచేశారు.

cock-fighting-in-ampapuram-krishna-district
కోడి పందెం

బరుల వద్ద ఏర్పాట్లే.... ఈ రేంజ్‌లో ఉంటే ఇక్కడ పందేలు ఏ మేర సాగి ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కరెన్సీనోట్లు.. ఇదిగో ఇలా బహిరంగంగానే చేతులు మారాయి. పందేలు సంప్రదాయబద్ధంగానే జరిగాయంటున్ననిర్వాహకులు.. సందర్శకుల ఆనందమే తమ ఆనందం అంటూ... కానిచ్చేస్తున్నారు.

సందర్శకుల తాడిడి ఎక్కువవడం వల్ల ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. వీక్షకుల్ని మరింతగా ఆకర్షించేందుకు... కనుమ సందర్భంగా ఎడ్ల పందేలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.