సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చింతలపాలెం మండలం పికలనాయక్ తండాకు చెందిన గిరిజన యువతి నిన్న హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్యాచారం చేసి... హత్యచేసినట్లు యువతి బంధువులు ఆరోపించారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు.
రాజశేఖర్ అనే యువకుడు తమ కూతురిని అత్యాచారం చేసి హతమార్చాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు బైఠాయించారు.
విషయం తెలుసుకున్న హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వచ్చి యువతి బంధువులకు హామీ ఇచ్చారు. ఆందోళన కొనసాగుతూనే ఉంది.
ఇదీ చదవండి: దారుణం: అమెరికాలో హైదరాబాదీ మర్డర్