ETV Bharat / jagte-raho

డెంగ్యూతో వస్తే... డెడ్ బాడీని ఇచ్చారు: బంధువులు

వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందాడంటూ... కూకట్​పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.

ఆసుపత్రిలో యువకుడి మృతి... బంధువుల ఆందోళన
author img

By

Published : Jul 31, 2019, 7:00 PM IST

జగద్గిరిగుట్టకు చెందిన రాజ్​కుమార్ వారం క్రితం డెంగ్యూ జ్వరంతో కూకట్​పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఆసుపత్రిలో చేరేటప్పుడు పరిస్థితి బాగానే ఉందని, ప్లేట్లెట్స్​ తగ్గుతున్నా వైద్యులు పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉన్నా... వైద్యులు నిర్లక్ష్యం వహించి, పరిస్థితి చేయి దాటిపోయాక ఐసీయూకి తరలించినట్లు తెలిపారు. తీరా ఇవాళ ఉదయం రాజ్​కుమార్ చనిపోయినట్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి యాజమాన్యంపై... కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారు.

ఆసుపత్రిలో యువకుడి మృతి... బంధువుల ఆందోళన

ఇవీ చూడండి:'జల విద్యుత్ ఉత్పత్తి ఎంత పెరిగింది..?'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.