ETV Bharat / jagte-raho

సొంత అన్ననే కర్రతో కొట్టి చంపిన తమ్ముడు - telangana varthalu]

మద్యం మత్తులో మాట మాట పెరిగి సొంత అన్ననే తమ్ముడు కర్రతో కొట్టి చంపిన దారుణ ఘటన ములుగు జిల్లా నరేందర్​రావు పేటలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సొంత అన్ననే కర్రతో కొట్టి చంపిన తమ్ముడు
సొంత అన్ననే కర్రతో కొట్టి చంపిన తమ్ముడు
author img

By

Published : Jan 17, 2021, 9:51 AM IST

ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నరేందర్​రావు పేటలో తాగిన మైకంలో తమ్ముడే అన్నను చంపాడు. అన్నదమ్ములు కల్తీ నవీన్, కల్తీ నాగబాబు ఇద్దరూ శనివారం సాయంత్రం ఇంట్లో కలిసి మద్యం తాగుతుండగా మాట మాట పెరిగి గొడవ పడ్డారు. గొడవ తీవ్ర స్థాయికి చేరడం వల్ల అన్న తలపై తమ్ముడు నాగబాబు కర్రతో కొట్టాడు. నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు.

విషయం తెలిసిన గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని తాళ్లతో నాగబాబు కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులు రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. నవీన్​ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.