ETV Bharat / jagte-raho

యువకుల మధ్య గొడవ.. ఒకరిపై కత్తితో దాడి

దారి పక్కనుంచి వెళ్లే క్రమంలో ఒక బైక్​ మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దానితో యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘర్షణ సద్దుమనిగింది. కానీ మధ్యలో మరో వ్యక్తి ప్రమేయంతో ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి కత్తిపోట్ల వరకు దారి తీసింది. ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా వెలిశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Young men attacked with a sword on another man at velishala village in suryapet district
యువకుల మధ్య గొడవ.. ఒకరిపై కత్తితో దాడి
author img

By

Published : Oct 26, 2020, 6:34 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమల గిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన సాయికుమార్​ అతని మిత్రులు పక్క గ్రామంలోని స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లారు. ఫంక్షన్​ అయిపోయి తిరిగి వస్తుండగా దారి మధ్యలో ఆగి ఉన్న అదే గ్రామానికి చెందిన ప్రసాద్​ వాహనం పక్క నుంచి వెళ్లే క్రమంలో ఢీ కొట్టారు. దీనితో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొంత సేపటి తరువాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

ఇదిలా ఉండగా స్థానిక వార్డు సభ్యుడు దండిగ కరుణాకర్​ ప్రసాద్​ను పిలిచి మాట్లాడాడు. దానితో గొడవ పెరిగి పెద్దదైంది. అది మనసులో పెట్టుకుని ప్రసాద్​ అతని అనుచరులతో కలిసి సాయికుమార్​పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల అతన్ని స్థానికులు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్​కు తరలించారు. బాధితుడి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.డానియోల్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చూడండి: షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.