నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో పర్రె ఆంజనేయులు(అంజి) తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. గత బుధవారం నుంచి ఇతడు కనవడ లేదు. ఆ యువకుడి మృత దేహాన్ని గ్రామంలోని డ్రైనేజీ కాలువలో స్థానికులు గుర్తించారు.
అమ్రాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒక్కగానొక్క కొడుకు హత్యకు గురైనందున అతని తల్లి గుండెలు అవిసేలా రోదించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది.. గత బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు అంజిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అమ్రాబాద్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. హంతకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: 15 నుంచి 'వందే భారత్ మిషన్' రెండో దశ