రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం వెంకట్రావు పేటలో క్రికెట్ ఆడుతూ... అప్పాల ప్రవీణ్(21) అనే యువకుడు గుండె పోటుతో మృతి చెందాడు. నాగారం గ్రామానికి చెందిన మీనయ్య, ఎల్లవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పెద్ద కుమారుడికి పెళ్లి కాగా, చిన్న కుమారుడు ప్రవీణ్ డిగ్రీ పూర్తి చేశాడు.
వెంకట్రావు పేటలో నిర్వహించిన జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో ప్రవీణ్ పాల్గొన్నాడు. ఆట ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: కొవిడ్ మహత్యం... పుట్టుకొచ్చిన కొత్త వ్యాపారం!