ETV Bharat / jagte-raho

రోడ్డుపై నిలిచిన డీసీఎం.. చీకట్లో ఢీ కొట్టి బైకర్ మృతి

ఓ ద్విచక్ర వాహనదారుడు నిలిచి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం బహదూర్​పుర పోలీస్ స్టేషన్ పరిధి జూ పార్కు సమీపంలో జరిగింది.

young-man-died-in-a-accident-at-bahadurpura-police-station-region-hyderabad
డీసీఎంను వెనుక నుంచి ఢీ కొట్టిన బైక్​.. యువకుడు మృతి
author img

By

Published : Jul 6, 2020, 12:38 PM IST

అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న సైఫుద్దీన్ అనే యువకుడు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్​పుర పోలీస్ స్టేషన్ పరిధి జూ పార్కు సమీపంలో నిలిచి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో డీసీఎంలో ఇరుక్కుపోయిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్​ చేస్తారని.. రాత్రి సమయాల్లో రోడ్లపై ఇవి కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనాదారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: గుడ్​న్యూస్​: ఐటీ సంస్థల అవకాశం... అభ్యర్థుల్లో ఆనందోత్సాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.