సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన బంటు కల్యాణ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. యువతి ఒప్పుకోకపోవడం వల్ల అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ వేధించడం మొదలుపెట్టాడు.
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.