నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంటాపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ అనే రైతు ఆరు ఎకరాల సాగుభూమిని కౌలుకు తీసుకున్నాడు. సాగుకు దాదాపు లక్షన్నర అప్పు చేశాడు. నాలుగున్నర ఎకరాల్లో వరి, ఎకరంన్నరలో సోయా, పసుపు సాగు చేశాడు.
తీవ్ర వేదనతో...
ఎంతో కష్టపడి సాగు చేసిన అతనికి వర్షాలు కన్నీళ్లనే మిగిల్చాయి. అధిక వర్షాల కారణంగా సోయా పంట పూర్తిగా నష్టపోగా... వరి పంటకు దోమ సోకింది. దిగుబడి రాదని రాజేశ్వర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పంట వల్ల లాభం వచ్చే మార్గం లేదని తెలిసి... చేసిన అప్పును తీర్చలేని అయోమయ పరిస్థితుల్లో సోమవారం పురుగుల మందు తాగాడు.
గమనించిన స్థానికులు అతనిని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాజేశ్వర్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్ నరసింహారెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పంట దక్కక.. అప్పు తీర్చలేక.. యువ రైతులు బలవన్మరణం