ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మోదుగుల పూర్ణచంద్రరావు గత నెల 23న హత్యకు గురయ్యాడు. విచారణ మెుదలుపెట్టిన పోలీసులకు నిజాలు తెలిశాయి. తవ్వుతుంటే .. అసలు విషయాలు బయటపడ్డాయి. పిడుగురాళ్లకు చెందిన నాగూర్బీకి.. పూర్ణచంద్రరావుకు వివాహేతర సంబంధం ఉండేంది.
ఈ విషయం తెలిసి నాగూర్బీకి ఆమె భర్త షఫీకి మధ్య గొడవలు మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె గుంటూరులో కూలీ పనులు చేసుకుంటూ.. తన పిల్లలతో జీవిస్తోంది. అప్పుడప్పుడూ నాగూర్బీకీ పూర్ణచంద్రరావు డబ్బులు కూడా పంపేవాడు. ఆమె ద్వారా మరో అమ్మాయికి పూర్ణచంద్రరావు పరిచయమయ్యాడు.
ఓ రోజు నాగూర్బీతో భర్త షఫీ.. గొడవ పెట్టుకున్నాడు. పూర్ణచంద్రరావుని చంపి తన దగ్గరకు కాపురానికి రావాలని నాగూర్ బీకి తెగేసి చెప్పాడు. ప్రియుడిని ఎలాగైనా చంపాలని పక్కా ప్లాన్ వేసింది నాగూర్‌బీ. పూర్ణచంద్రరావుకి ఫొన్ చేసి.. డబ్బులు ఇస్తానని చెప్పి గుంటూరుకు రమ్మంది. అతడు ఆమెను నమ్మి వచ్చాడు. ముందుగా వేసిన పథకం ప్రకారం.. నాగూర్ బీ తనకు తెలిసిన రాజేశ్, కరిముల్లాల సాయంతో పూర్ణచంద్రరావు గొంతుకు కేబుల్ వైర్, చున్నీ బిగించి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో చుట్టి అనంతవరప్పాడు-బొంతపాడు డొంకరోడ్డు సమీపంలోని పంట కాల్వలో పడేశారు. అయితే ఆ సంచిలో నాగూర్‌బీ తన భర్త షఫీకి సంబంధించిన గుర్తింపు కార్డులను ఉంచింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు.
ఇదీ చదవండి: పబ్జీ ఆడిన తరువాత గుండె ఆగిపోయింది!