కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దేవవ్వకు గొలుసు కట్టు సంస్థలో డబ్బులు కడితే రెట్టింపవుతాయని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. ఆ మాటలు నమ్మి కొన్నేళ్లుగా కూడబెట్టిన సొమ్ము, అప్పుగా తెచ్చిన డబ్బు మొత్తం కలిపి రూ.లక్షన్నరను బీర్షెబా అనే గొలుసుకట్టు సంస్థకు కట్టింది. కొన్ని నెలలు డబ్బులు రావడం వల్ల సంతోషించింది.
తీరా... లాక్డౌన్ సమయంలో సంస్థ బోర్డు తిప్పేయగా... తీవ్ర మనోవేదనకు గురై కొన్ని రోజులుగా మంచంపట్టింది. పరిస్థితి విషమించగా నేడు ప్రాణం వదిలింది. మృతురాలి బంధువులు బీర్షెబా ఏజెంట్ ఇంటిని ముట్టడించి... దేవవ్వ కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.