ETV Bharat / jagte-raho

ఫతేపూర్​ అటవీ ప్రాంతంలో మహిళ దారుణ హత్య - women was killed in mahabubnagar

రెండ్రోజులుగా కనిపించకుండా పోయిన మహిళ ఫతేపూర్ రిజర్వ్ ఫారెస్ట్​లో విగతజీవిగా కనిపించిన సంఘటన మహబూబ్​నగర్​ జిల్లా నవాబ్​పేట మండలంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్లే వాహనదారులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

woman was killed in fatepoor forest in mahabubnagar
ఫతేపూర్​ అటవీ ప్రాంతంలో మహిళ దారుణ హత్య
author img

By

Published : Oct 10, 2020, 3:30 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా నవాబ్​పేట మండల పరిధిలోని ఫతేపూర్​ గ్రామసమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఫతేపూర్ రిజర్వ్ ఫారెస్ట్​లో మహిళ మృతదేహాన్ని గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.

మహిళ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. రుద్రారం గ్రామానికి చెందిన చంద్రకళగా గుర్తించారు. రెండ్రోజుల నుంచి చంద్రకళ కనిపించడం లేదని ఆమె భర్త పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారని తెలిపారు. రుక్కంపల్లికి చెందిన హనుమయ్యపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేయగా.. అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.